మంథా భానుమతి చక్కని అందమైన శైలితో వచనం వ్రాయగల మంచి రచయిత్రి. ఆమె కథ వ్రాసినా, నవల వ్రాసినా అది అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ 'రామాయణం మామయ్య' పేరు విచిత్రంగానూ, సరదాగానూ ఉంది. ఇది చిన్న నవల. ఇందులో భానుమతి కోనసీమ నేపథ్యంలో కథనంతా నడిపారు. ముఖ్యంగా అగ్రహారాలలో సంపన్నులైన బ్రాహ్మణ కుటుంబాలలోని సంప్రదాయాలు, ఆప్యాయతలు, అనురాగాలు, బాంధవ్యాలు అన్నీ ఎంతో చక్కగా చిత్రీకరించారు. పాత్రలన్నింటిలోనూ, గాఢమైన సంప్రదాయపు పట్టుదలలు ఉన్నా మానవత్వంతో, సంస్కారంతో ఆలోచించే పాత్రల వివరణ బాగుంది.
రామాయణం మమ్మయ్యగా పిలువబడే పెద్దాయన ఒక క్రమశిక్షణా బద్ధుడుగా ఉంది తన మాటమీదే అందర్నీ నడిపిస్తాడు. రామాయణం మామయ్యా చెప్పినట్టుగా అందరూ వినాల్సిందే, నడుచుకోవాల్సిందే. అయితే ఆయన ఆలోచన, అంతరంగం సున్నితమైనవి. ఎవ్వరినీ ద్వేషించటం, పగ సాధించటం ఆయన కస్సలు లేవు. రామాయణం మామయ్య కథ సత్యం పాత్ర నుంచి చెప్పబడుతుంది.
మంథా భానుమతి చక్కని అందమైన శైలితో వచనం వ్రాయగల మంచి రచయిత్రి. ఆమె కథ వ్రాసినా, నవల వ్రాసినా అది అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ 'రామాయణం మామయ్య' పేరు విచిత్రంగానూ, సరదాగానూ ఉంది. ఇది చిన్న నవల. ఇందులో భానుమతి కోనసీమ నేపథ్యంలో కథనంతా నడిపారు. ముఖ్యంగా అగ్రహారాలలో సంపన్నులైన బ్రాహ్మణ కుటుంబాలలోని సంప్రదాయాలు, ఆప్యాయతలు, అనురాగాలు, బాంధవ్యాలు అన్నీ ఎంతో చక్కగా చిత్రీకరించారు. పాత్రలన్నింటిలోనూ, గాఢమైన సంప్రదాయపు పట్టుదలలు ఉన్నా మానవత్వంతో, సంస్కారంతో ఆలోచించే పాత్రల వివరణ బాగుంది. రామాయణం మమ్మయ్యగా పిలువబడే పెద్దాయన ఒక క్రమశిక్షణా బద్ధుడుగా ఉంది తన మాటమీదే అందర్నీ నడిపిస్తాడు. రామాయణం మామయ్యా చెప్పినట్టుగా అందరూ వినాల్సిందే, నడుచుకోవాల్సిందే. అయితే ఆయన ఆలోచన, అంతరంగం సున్నితమైనవి. ఎవ్వరినీ ద్వేషించటం, పగ సాధించటం ఆయన కస్సలు లేవు. రామాయణం మామయ్య కథ సత్యం పాత్ర నుంచి చెప్పబడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.