బైరాగి స్వతంత్ర భావాలు కల వ్యక్తి. స్నేహితులు ఏవయినా సలహాలు ఇస్తే నవ్వి ఊరుకునేవాడు. తన పంథా మార్చుకునేవాడు కాదు. బాగా తెలియని వారు బైరాగిని పలుకరించదానికి జంకేవారు. బైరాగికి వివాహం చేసుకోవాలనే సంకల్పం ఏనాడూ ఉండేది కాదు. వివాహ బంధం కూడా తన స్వేచ్చకు ఆటంకంగా భావించేవాడు. ఎవరయినా సన్నిహిత మిత్రులు వివాహ ప్రస్తావన తీసుకువస్తే - 'వివాహం చేసుకుని మీరు పడుతున్న అవస్థలు చూస్తున్నాను కదా' అనేవాడట.
బైరాగి చాలా నిరాడంబరంగా ఉండేవాడు. పరిస్థితులను బట్టి అవసరాలను తగ్గించుకునేవాడు. తన కవిత్వం, కథలు, వ్యాసాల వలన వచ్చే స్వల్ప ఆదాయంతోనే కాలయాపన చేస్తూ ఉండేవాడు. తమ్ముళ్ళు ముగ్గురూ ఎంతో అభిమానం చూపినా, బైరాగి కోసం ఎటువంటి త్యాగానికయినా సిద్ధపడినా, బైరాగి మాత్రం వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవాడు కాదు. జీవితకాలంలో ఎవరికీ తలవంచని బైరాగి జీవిత చారమాంకంలో హితుల, ఆత్మీయుల అభ్యర్థనలకు సయితం తలవంచక, వైద్యం చేయించుకోవడానికి నిరాకరించి మృత్యుకౌగిలిని ఆనందంగా స్వీకరించాడు.
బైరాగి స్వతంత్ర భావాలు కల వ్యక్తి. స్నేహితులు ఏవయినా సలహాలు ఇస్తే నవ్వి ఊరుకునేవాడు. తన పంథా మార్చుకునేవాడు కాదు. బాగా తెలియని వారు బైరాగిని పలుకరించదానికి జంకేవారు. బైరాగికి వివాహం చేసుకోవాలనే సంకల్పం ఏనాడూ ఉండేది కాదు. వివాహ బంధం కూడా తన స్వేచ్చకు ఆటంకంగా భావించేవాడు. ఎవరయినా సన్నిహిత మిత్రులు వివాహ ప్రస్తావన తీసుకువస్తే - 'వివాహం చేసుకుని మీరు పడుతున్న అవస్థలు చూస్తున్నాను కదా' అనేవాడట. బైరాగి చాలా నిరాడంబరంగా ఉండేవాడు. పరిస్థితులను బట్టి అవసరాలను తగ్గించుకునేవాడు. తన కవిత్వం, కథలు, వ్యాసాల వలన వచ్చే స్వల్ప ఆదాయంతోనే కాలయాపన చేస్తూ ఉండేవాడు. తమ్ముళ్ళు ముగ్గురూ ఎంతో అభిమానం చూపినా, బైరాగి కోసం ఎటువంటి త్యాగానికయినా సిద్ధపడినా, బైరాగి మాత్రం వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవాడు కాదు. జీవితకాలంలో ఎవరికీ తలవంచని బైరాగి జీవిత చారమాంకంలో హితుల, ఆత్మీయుల అభ్యర్థనలకు సయితం తలవంచక, వైద్యం చేయించుకోవడానికి నిరాకరించి మృత్యుకౌగిలిని ఆనందంగా స్వీకరించాడు.© 2017,www.logili.com All Rights Reserved.