రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "రావిశాస్త్రీయం" లో 'ఓ విధంగా చూస్తే మంచిచెడ్డలు నిర్ణయించుకోవడంలోనే మానవ యాత్ర సాగుతుందనీ, మంచిచెడ్డల సంఘర్షణలోనే మానవ చరిత్ర ఇమిడి ఉంటుందని చెప్పవచ్చునేమో. మంచి చెడుల నిర్ణయమే సాహిత్య ప్రయోజనం' అంటారు రచయిత.
రావిశాస్త్రి గారు ఎప్పుడు జనంలో, జనంతో ఉంటారు. వాళ్ళతో నిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆయన రచనా వ్యాసంగానికి ఇది జీవధాతువు. నీటిలో చేపలా ఎప్పుడూ సామాన్యులతోనే మసిలేవారాయన. వాస్తవికతాచిత్రణ ఆయన ఆయుపట్టు. ఆయన సాహిత్యంలో కీలకమైన అంశం అదే. "రావిశాస్త్రీయం" లో 'ఓ విధంగా చూస్తే మంచిచెడ్డలు నిర్ణయించుకోవడంలోనే మానవ యాత్ర సాగుతుందనీ, మంచిచెడ్డల సంఘర్షణలోనే మానవ చరిత్ర ఇమిడి ఉంటుందని చెప్పవచ్చునేమో. మంచి చెడుల నిర్ణయమే సాహిత్య ప్రయోజనం' అంటారు రచయిత.© 2017,www.logili.com All Rights Reserved.