సనాతనధర్మప్రతీక అయినట్టి భారతీయ జీవనవిధానంలో విశిష్టస్థానంగల దేవాలయసంస్కృతిలో గ్రామదేవతల ఆరాధన ఒక ప్రత్యేకమైన ప్రసిద్ధ అంశం. సర్వవ్యాపి అయిన భగవంతుడు అన్నింటా ఉన్నాడని విశ్వసించే తత్త్వం భారతీయుల విశిష్టగుణం. ఈ నేపథ్యంలో పలురకములైన గ్రామదేవతల పూజలు శాక్తేయ ఆరాధనలు వంటివి దేశమంతటా విస్తారంగా అగుపడతాయి.
ఇట్టివాటిలో భాగంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పల్లె ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ప్రజల్లో కులాతీతంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతర కులాలు ఎన్నింటిలోనో కులదేవతలుగా ఆరాదించబడే ప్రసిద్ధ గ్రామీణ దేవతామూర్తులుగా శ్రీ అక్కమ్మగార్లు మనకు అగుపడుతారు. వీరి పూజవిధానాల్లో అంతర్భాగమై సాంప్రదాయ బ్రాహ్మణ కులాలలో ప్రధానంగా అగుపడే 'శ్రీ అక్కదేవరలపాట' ఒక విశేషమైన జానపద గేయసాహిత్య ప్రతీక.
సనాతనధర్మప్రతీక అయినట్టి భారతీయ జీవనవిధానంలో విశిష్టస్థానంగల దేవాలయసంస్కృతిలో గ్రామదేవతల ఆరాధన ఒక ప్రత్యేకమైన ప్రసిద్ధ అంశం. సర్వవ్యాపి అయిన భగవంతుడు అన్నింటా ఉన్నాడని విశ్వసించే తత్త్వం భారతీయుల విశిష్టగుణం. ఈ నేపథ్యంలో పలురకములైన గ్రామదేవతల పూజలు శాక్తేయ ఆరాధనలు వంటివి దేశమంతటా విస్తారంగా అగుపడతాయి. ఇట్టివాటిలో భాగంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పల్లె ప్రాంతాల్లో, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ప్రజల్లో కులాతీతంగా బ్రాహ్మణ, బ్రాహ్మణేతర కులాలు ఎన్నింటిలోనో కులదేవతలుగా ఆరాదించబడే ప్రసిద్ధ గ్రామీణ దేవతామూర్తులుగా శ్రీ అక్కమ్మగార్లు మనకు అగుపడుతారు. వీరి పూజవిధానాల్లో అంతర్భాగమై సాంప్రదాయ బ్రాహ్మణ కులాలలో ప్రధానంగా అగుపడే 'శ్రీ అక్కదేవరలపాట' ఒక విశేషమైన జానపద గేయసాహిత్య ప్రతీక.© 2017,www.logili.com All Rights Reserved.