పాఠకులందరికీ నా హృదయ పూర్వకమైన నమస్కారాలు. మనసులోని అభిప్రాయాలు పంచుకునే అవకాశమిచ్చినందుకు ఈ పుస్తక రచయిత శ్రీ పసుపులేటి రామారావు గారికి ముందుగా నా ధన్యవాదాలు. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే చాలా కష్టం. కానీ దా.స.రి. అన్న మూడక్షరాలు చాలు, వారెంతో తెలియాలంటే.. దా.. అంటే దాతృత్వం, స.. అంటే సమర్ధత, రి.. అంటే రివల్యూషనరీ.
దాసరి నారాయణరావు గారు, ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని సంచలనాలు సృష్టించినా, ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా ఈరోజున వారికి ప్రజల హృదయాల్లో సింహాసనమేసింది మాత్రం వారి 'దాతృత్వమే'. నేను పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచీ గమనిస్తున్నాను. వాళ్ళింట్లో ప్రతీపూటా యాభైకి తక్కువ కాకుండా విస్తర్లు పరుస్తూనే ఉన్నారు. కలవడానికి వచ్చిన వారెవరూ ఖాళీ కడుపుతో తిరిగెళ్లడం వారికి ఇష్టం ఉండేది కాదు. అర్ధరాత్రి వెళ్లి తలుపు తట్టినా చిరునవ్వుతో ఎదురొచ్చిమరీ సాయపడ్డారు. అది వారి దాతృత్వం.
పెద్ద హీరోల సినిమాలైనా, కొత్త హీరోల సినిమాలైనా దాసరి గారి సినిమాల్లో దాసరి గారి మార్కే ఖచ్చితంగా కనబడుతుంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నటన ఇలా ఏ శాఖమీదైనా పట్టు సాధించిన సమర్థుడు.
మనందరికీ తెలుసు.. రివల్యూషన్ అంటే మార్పు. దాసరి గారి ముందు వరకూ మన తెలుగు చిత్రసీమలో చాలా మంది దర్శకులు, కథారచయితల చేత కథలు రాయించి, మాటల రచయితలతో సంభాషణలు రాయించి, ప్రతీ టెక్నీషియన్ దగ్గర నుంచీ పని రాబట్టుకుంటూనే, తమ దర్శకత్వ ప్రతిభను జోడించి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కిస్తూ ఉండేవారు.
- డా కె చిరంజీవి
పాఠకులందరికీ నా హృదయ పూర్వకమైన నమస్కారాలు. మనసులోని అభిప్రాయాలు పంచుకునే అవకాశమిచ్చినందుకు ఈ పుస్తక రచయిత శ్రీ పసుపులేటి రామారావు గారికి ముందుగా నా ధన్యవాదాలు. గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే చాలా కష్టం. కానీ దా.స.రి. అన్న మూడక్షరాలు చాలు, వారెంతో తెలియాలంటే.. దా.. అంటే దాతృత్వం, స.. అంటే సమర్ధత, రి.. అంటే రివల్యూషనరీ. దాసరి నారాయణరావు గారు, ఎన్ని విజయాలు సాధించినా ఎన్ని సంచలనాలు సృష్టించినా, ఎన్ని ఉన్నత పదవులు చేపట్టినా ఈరోజున వారికి ప్రజల హృదయాల్లో సింహాసనమేసింది మాత్రం వారి 'దాతృత్వమే'. నేను పరిశ్రమలో అడుగు పెట్టినప్పటి నుంచీ గమనిస్తున్నాను. వాళ్ళింట్లో ప్రతీపూటా యాభైకి తక్కువ కాకుండా విస్తర్లు పరుస్తూనే ఉన్నారు. కలవడానికి వచ్చిన వారెవరూ ఖాళీ కడుపుతో తిరిగెళ్లడం వారికి ఇష్టం ఉండేది కాదు. అర్ధరాత్రి వెళ్లి తలుపు తట్టినా చిరునవ్వుతో ఎదురొచ్చిమరీ సాయపడ్డారు. అది వారి దాతృత్వం. పెద్ద హీరోల సినిమాలైనా, కొత్త హీరోల సినిమాలైనా దాసరి గారి సినిమాల్లో దాసరి గారి మార్కే ఖచ్చితంగా కనబడుతుంది. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం, నటన ఇలా ఏ శాఖమీదైనా పట్టు సాధించిన సమర్థుడు. మనందరికీ తెలుసు.. రివల్యూషన్ అంటే మార్పు. దాసరి గారి ముందు వరకూ మన తెలుగు చిత్రసీమలో చాలా మంది దర్శకులు, కథారచయితల చేత కథలు రాయించి, మాటల రచయితలతో సంభాషణలు రాయించి, ప్రతీ టెక్నీషియన్ దగ్గర నుంచీ పని రాబట్టుకుంటూనే, తమ దర్శకత్వ ప్రతిభను జోడించి అద్భుతమైన చిత్రాలు తెరకెక్కిస్తూ ఉండేవారు. - డా కె చిరంజీవి© 2017,www.logili.com All Rights Reserved.