E=mc^2 అన్నది ప్రపంచంలో అన్నిటికంటే ప్రఖ్యాత సమీకరణం. దీన్ని చూడగానే దాని గురించి ఏమీ తెలియనివారు సైతం అది ఐన్ స్టయిన్ సమీకరణం అని చెప్పేస్తారు. మహా మేధావి అన్న పదానికి ఐన్ స్టయిన్ ఒక పర్యాయ పదంగా మారిపోయాడు. ఆయన ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. విజ్ఞాన శాస్త్ర తాత్వికుడు. 1921 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆయన సుప్రసిద్ధమైన సాపేక్ష సిద్ధాంతానికి కాదు. ఫోటో విద్యుత్ ప్రభావ నియమం అనే ఆయన మరో ఆవిష్కరణకుగాను ఈ బహుమతి లభించింది.
ఈ ఆవిష్కరణ క్వాంటం సిద్ధాంతానికి పునాది వేసిందని చెప్పవచ్చు. సాపేక్ష సిద్ధాంతమూ క్వాంటం సిద్ధాంతమూ 20వ శతాబ్దంలో అత్యంత మహత్తరమైన ఆవిష్కరణలంటారు. అందుకే ఆ శతాబ్దానికి ఐన్ స్టయిన్ తిరుగులేని శాస్త్ర ప్రతినిధి అని చెప్పవచ్చు. నిశ్చల నిశ్చితాలుగా కనిపించిన న్యూటన్ సిద్ధాంతాలను ఆయన తిరగరాసి సైన్సులో విప్లవం సృష్టించాడు. ఐన్ స్టయిన్ 1879 మార్చి 14న పుట్టాడు. 1955 ఏప్రిల్ 18న చనిపోయాడు.
E=mc^2 అన్నది ప్రపంచంలో అన్నిటికంటే ప్రఖ్యాత సమీకరణం. దీన్ని చూడగానే దాని గురించి ఏమీ తెలియనివారు సైతం అది ఐన్ స్టయిన్ సమీకరణం అని చెప్పేస్తారు. మహా మేధావి అన్న పదానికి ఐన్ స్టయిన్ ఒక పర్యాయ పదంగా మారిపోయాడు. ఆయన ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. విజ్ఞాన శాస్త్ర తాత్వికుడు. 1921 లో ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ఆయన సుప్రసిద్ధమైన సాపేక్ష సిద్ధాంతానికి కాదు. ఫోటో విద్యుత్ ప్రభావ నియమం అనే ఆయన మరో ఆవిష్కరణకుగాను ఈ బహుమతి లభించింది. ఈ ఆవిష్కరణ క్వాంటం సిద్ధాంతానికి పునాది వేసిందని చెప్పవచ్చు. సాపేక్ష సిద్ధాంతమూ క్వాంటం సిద్ధాంతమూ 20వ శతాబ్దంలో అత్యంత మహత్తరమైన ఆవిష్కరణలంటారు. అందుకే ఆ శతాబ్దానికి ఐన్ స్టయిన్ తిరుగులేని శాస్త్ర ప్రతినిధి అని చెప్పవచ్చు. నిశ్చల నిశ్చితాలుగా కనిపించిన న్యూటన్ సిద్ధాంతాలను ఆయన తిరగరాసి సైన్సులో విప్లవం సృష్టించాడు. ఐన్ స్టయిన్ 1879 మార్చి 14న పుట్టాడు. 1955 ఏప్రిల్ 18న చనిపోయాడు.© 2017,www.logili.com All Rights Reserved.