"పచ్చగా కళకళలాడుతున్న వేలాది ఎకరాల బీలభూములపై ఆధారపడి బ్రతుకుతున్న గ్రామస్తులు ఆ భూములకు హటాత్తుగా ధరలు పెరగడంతో ఎగబడి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఆపని ఎంత ప్రాణాంతక మైనదో తెలిసి విలవిల్లాడారు. ఇంతకి ఆ భూముల రేట్లు పెరగడానికి కారణమేమిటి? ఆ బీదాబిక్కి జనానికి వచ్చిన ముప్పేమిటి? ఆధ్యంతం ఆసక్తిగా చదివించే నవల."
-చతుర
బహుళజాతి కంపెనీల పడగనీడలో, ప్రభుత్వం అండదండలతో ప్రజాప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు, క్రోనీ పెట్టుబడిదారులు కలిసి కల్పించిన అభివృద్ధి మృగతృష్టల భ్రమలు తొలిగిన జనం గండుచీమలై, గండభేరుండాలై అడ్డుకున్న పోరాటగాధ ఈ ఆకుపచ్చ విధ్వంసం
-ముక్తవరం పార్ధసారధి
అభివృద్ధి అనేది ఒక మిధ్య. ఇక్కడ ప్రధాన ప్రశ్న- అభివృద్ధి అనేది ఎవరికోసం అనేది, దాని ఫలాలు ఎవరు అందుకోవాలి అని. ఈ కోణం నుండి చర్చ సాగితే, ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి అసలు రంగు బయటపడుతుంది. ఆరు దశాబ్దాలు పైబడిన స్వతంత్ర భారతదేశంలో ఇన్ని ప్రణాళికలు అమలు జరిగాక, ఇంకా మనం అభివృద్ధి ఫలితాలను గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి లేదు. ఎంత విద్యుత్ ఉత్పత్తి అయినా, ఎన్ని గనులు తవ్వినా, ఎన్ని ప్రాజెక్ట్ లు కట్టినా దాని నుండి వచ్చిన ఫలితాలలో సింహభాగం వ్యాపారవర్గానికి లాభాల రూపేణా పోతున్న విషయం ఏ గణాంకాలు తీసుకున్నా తేలిపోయే సత్యం. అంటే, ఆ ఫలితాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడనప్పుడు ప్రకృతిని ఇంత దారుణంగా విధ్వంసం చేసి, మనం సాధించేది ఏమిటి? సరిగ్గా ఇక్కడే ఈ ప్రశ్నకి సమాధానంగానే, శిరంశెట్టి కాంతారావు రాసిన ఆకుపచ్చ విధ్వంసం నవల మొదలవుతుంది.
-వాసిరెడ్డి నవీన్
"పచ్చగా కళకళలాడుతున్న వేలాది ఎకరాల బీలభూములపై ఆధారపడి బ్రతుకుతున్న గ్రామస్తులు ఆ భూములకు హటాత్తుగా ధరలు పెరగడంతో ఎగబడి అమ్ముకున్నారు. ఆ తర్వాత ఆపని ఎంత ప్రాణాంతక మైనదో తెలిసి విలవిల్లాడారు. ఇంతకి ఆ భూముల రేట్లు పెరగడానికి కారణమేమిటి? ఆ బీదాబిక్కి జనానికి వచ్చిన ముప్పేమిటి? ఆధ్యంతం ఆసక్తిగా చదివించే నవల." -చతుర బహుళజాతి కంపెనీల పడగనీడలో, ప్రభుత్వం అండదండలతో ప్రజాప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు, క్రోనీ పెట్టుబడిదారులు కలిసి కల్పించిన అభివృద్ధి మృగతృష్టల భ్రమలు తొలిగిన జనం గండుచీమలై, గండభేరుండాలై అడ్డుకున్న పోరాటగాధ ఈ ఆకుపచ్చ విధ్వంసం -ముక్తవరం పార్ధసారధి అభివృద్ధి అనేది ఒక మిధ్య. ఇక్కడ ప్రధాన ప్రశ్న- అభివృద్ధి అనేది ఎవరికోసం అనేది, దాని ఫలాలు ఎవరు అందుకోవాలి అని. ఈ కోణం నుండి చర్చ సాగితే, ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి అసలు రంగు బయటపడుతుంది. ఆరు దశాబ్దాలు పైబడిన స్వతంత్ర భారతదేశంలో ఇన్ని ప్రణాళికలు అమలు జరిగాక, ఇంకా మనం అభివృద్ధి ఫలితాలను గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఇంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకోటి లేదు. ఎంత విద్యుత్ ఉత్పత్తి అయినా, ఎన్ని గనులు తవ్వినా, ఎన్ని ప్రాజెక్ట్ లు కట్టినా దాని నుండి వచ్చిన ఫలితాలలో సింహభాగం వ్యాపారవర్గానికి లాభాల రూపేణా పోతున్న విషయం ఏ గణాంకాలు తీసుకున్నా తేలిపోయే సత్యం. అంటే, ఆ ఫలితాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడనప్పుడు ప్రకృతిని ఇంత దారుణంగా విధ్వంసం చేసి, మనం సాధించేది ఏమిటి? సరిగ్గా ఇక్కడే ఈ ప్రశ్నకి సమాధానంగానే, శిరంశెట్టి కాంతారావు రాసిన ఆకుపచ్చ విధ్వంసం నవల మొదలవుతుంది. -వాసిరెడ్డి నవీన్© 2017,www.logili.com All Rights Reserved.