"భాగవత" మంటే భగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్ని తెలియచేసేవారిని "భాగవతు"లంటారు. వాళ్ళు పరమ భగవతోత్తములై తాము దర్శించిన దానిని -
ఇతరులు ధన్యత చెందాలనే వుద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చైతన్యం, బ్రహ్మానందం కలిపి అందిస్తారు. అది విన్న, చదివిన వారలందరు భాగవతులై, భగవత్తత్వానందుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం.
అటువంటి దివ్యలక్షణాని కనుగుణంగా ఇటు భక్తీ - వేదాంత ఆధ్యాత్మిక దృష్టి, అటు వ్యాపారదృష్టి అంటే సద్గ్రంధాలను, సర్వభక్త జనానీకానికి అందించాలనే సదాశయంతో - నాతో -
"స్వామీ! కొన్ని క్రొత్త ప్రచురణలు తిసుకోవద్డామనుకుంటున్నా" నని చెప్పి - నన్ను -
1. సంక్షిప్త భాగవతం
2. సంక్షిప్త భారతం
3. సంక్షిప్త శ్రీమద్రామాయణం
చిన్న చిన్న సంపుటాలుగా వ్రాయమని కోరారు. ఆ ఆలోచనా దివ్య సరళికి - ఈ గ్రంధమొక మచ్చుతునక. అనకూడదు కాని, ఈ కధలన్నీ చదివితే (కృష్ణ) భాగవతాన్ని చదివిన "తృప్తి" - తప్పక కల్గుతుంది. కారణం -
ఆ భగవంతుడు నాకిచ్చిన "ఆవేశ - ఆదేశాలలో కొన్ని కొన్ని సమయాలలో - ఆ పాత్రలలో పాత్రనై పోయాను. బ్రహ్మానందమను భవించాను. ఆ సందర్భాలు, సంఘటనలు తప్పక, పఠీతులను భక్తులను చేస్తాయి. భక్తులను భగవంతుని చేరువ చేస్తాయి.
- రామకృష్ణ ప్రసాద్
"భాగవత" మంటే భగవత్తత్వాన్ని తెలియచేసేదని అర్ధం. ఈ భాగవత్తత్వాన్ని తెలియచేసేవారిని "భాగవతు"లంటారు. వాళ్ళు పరమ భగవతోత్తములై తాము దర్శించిన దానిని - ఇతరులు ధన్యత చెందాలనే వుద్దేశంతో, తమలోని భక్తీ, ఆనందం, చైతన్యం, బ్రహ్మానందం కలిపి అందిస్తారు. అది విన్న, చదివిన వారలందరు భాగవతులై, భగవత్తత్వానందుకోవాలనే సత్సంకల్పమే వారి లక్ష్యం. అటువంటి దివ్యలక్షణాని కనుగుణంగా ఇటు భక్తీ - వేదాంత ఆధ్యాత్మిక దృష్టి, అటు వ్యాపారదృష్టి అంటే సద్గ్రంధాలను, సర్వభక్త జనానీకానికి అందించాలనే సదాశయంతో - నాతో - "స్వామీ! కొన్ని క్రొత్త ప్రచురణలు తిసుకోవద్డామనుకుంటున్నా" నని చెప్పి - నన్ను - 1. సంక్షిప్త భాగవతం 2. సంక్షిప్త భారతం 3. సంక్షిప్త శ్రీమద్రామాయణం చిన్న చిన్న సంపుటాలుగా వ్రాయమని కోరారు. ఆ ఆలోచనా దివ్య సరళికి - ఈ గ్రంధమొక మచ్చుతునక. అనకూడదు కాని, ఈ కధలన్నీ చదివితే (కృష్ణ) భాగవతాన్ని చదివిన "తృప్తి" - తప్పక కల్గుతుంది. కారణం - ఆ భగవంతుడు నాకిచ్చిన "ఆవేశ - ఆదేశాలలో కొన్ని కొన్ని సమయాలలో - ఆ పాత్రలలో పాత్రనై పోయాను. బ్రహ్మానందమను భవించాను. ఆ సందర్భాలు, సంఘటనలు తప్పక, పఠీతులను భక్తులను చేస్తాయి. భక్తులను భగవంతుని చేరువ చేస్తాయి. - రామకృష్ణ ప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.