"జీవ పరిణామం పూర్తికాలేదు. తర్కం అన్నది చివరి మాటకాదు. తార్కిక జంతువు ప్రకృతిలో సర్వోత్తమ జంతువూ కాదు. కాదు. మనిషి జంతువు నుండి పరిణమించినట్లే. మనిషి నుండి అతి మానవుడు పరిణమిస్తాడు."
- శ్రీ అరవిందులు
ఇంగ్లాండ్ లో యువదశలో ఉన్న అరవిందునితో, భారతదేశంలో బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యపోరాటం సల్పిన అరవిందునితో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. తరువాత పారిస్ లోని చిత్రకారులూ, కళాకారుల మధ్య మిరా అల్ఫాసా (మదర్) యౌవనకాల జీవితం అల్జీరియా లో ఇక అతీంద్రియవాది (ఆకలిస్ట్) గా పరిణామం చెందడం వర్ణిస్తుంది. ఇద్దరూ తమ ఆధ్యాత్మిక భవితవ్యాన్ని గుర్తించారు. అది వారిని పాండిచ్చేరి లో కలిపింది. వారి చుట్టూ శిష్యులు చేరారు. శ్రీ అరవిందాశ్రమం ఏర్పడింది. భూమిపై లోకోత్తర చైతన్యస్థాపన, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిణమింపజేయడం, మనిషిని అధిగమించిన ఒక నూతన ప్రాణి ఆవిర్బావం అన్న తమ జీవిత లక్ష్యాల సాధన కోసం వారు కృషి చేశారు.
జార్జెస్ వాన్ వ్రెఖెం ప్లేమిష్ భాష మాట్లాడే బెల్జియన్. తన దేశంలో కవిగా, నాటకకర్త గా ప్రసిద్దుడు. శ్రీ అరవిందుల రచనలతోను, మదర్ రచనలతోను 1964లో ఆయనకు పరిచయం కలిగింది. 1970 లో పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం లో చేరాడు. 1978 లో ఆరోవిల్ సభ్యుడయ్యాడు. అప్పటి నుండి అదే అయన నివాసం. ఇతర రచయితలేవ్వరు సంపూర్ణంగా వినియోగించని ఆధారలనేన్నింటినో ముప్పై ఏళ్ళపాటు అధ్యయనం చేసి, ఆరేళ్ళు శ్రమించి వ్రెఖెం 'బియాండ్ మాన్' అన్న ఈ అద్బుత గ్రంధం రచించాడు.
"జీవ పరిణామం పూర్తికాలేదు. తర్కం అన్నది చివరి మాటకాదు. తార్కిక జంతువు ప్రకృతిలో సర్వోత్తమ జంతువూ కాదు. కాదు. మనిషి జంతువు నుండి పరిణమించినట్లే. మనిషి నుండి అతి మానవుడు పరిణమిస్తాడు." - శ్రీ అరవిందులు ఇంగ్లాండ్ లో యువదశలో ఉన్న అరవిందునితో, భారతదేశంలో బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యపోరాటం సల్పిన అరవిందునితో ఈ పుస్తకం ప్రారంభమౌతుంది. తరువాత పారిస్ లోని చిత్రకారులూ, కళాకారుల మధ్య మిరా అల్ఫాసా (మదర్) యౌవనకాల జీవితం అల్జీరియా లో ఇక అతీంద్రియవాది (ఆకలిస్ట్) గా పరిణామం చెందడం వర్ణిస్తుంది. ఇద్దరూ తమ ఆధ్యాత్మిక భవితవ్యాన్ని గుర్తించారు. అది వారిని పాండిచ్చేరి లో కలిపింది. వారి చుట్టూ శిష్యులు చేరారు. శ్రీ అరవిందాశ్రమం ఏర్పడింది. భూమిపై లోకోత్తర చైతన్యస్థాపన, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పరిణమింపజేయడం, మనిషిని అధిగమించిన ఒక నూతన ప్రాణి ఆవిర్బావం అన్న తమ జీవిత లక్ష్యాల సాధన కోసం వారు కృషి చేశారు. జార్జెస్ వాన్ వ్రెఖెం ప్లేమిష్ భాష మాట్లాడే బెల్జియన్. తన దేశంలో కవిగా, నాటకకర్త గా ప్రసిద్దుడు. శ్రీ అరవిందుల రచనలతోను, మదర్ రచనలతోను 1964లో ఆయనకు పరిచయం కలిగింది. 1970 లో పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం లో చేరాడు. 1978 లో ఆరోవిల్ సభ్యుడయ్యాడు. అప్పటి నుండి అదే అయన నివాసం. ఇతర రచయితలేవ్వరు సంపూర్ణంగా వినియోగించని ఆధారలనేన్నింటినో ముప్పై ఏళ్ళపాటు అధ్యయనం చేసి, ఆరేళ్ళు శ్రమించి వ్రెఖెం 'బియాండ్ మాన్' అన్న ఈ అద్బుత గ్రంధం రచించాడు.
© 2017,www.logili.com All Rights Reserved.