పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యలలో పదవ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకలైశ్వర్య ప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్యతిధి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక అంటే లక్ష్మిస్వరూపిణి అని అర్ధం. శాంత స్వరూపిణి అని అర్ధం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీకమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
శ్రీ కమలాత్మికా సాధన అనే ఈ పుస్తకంద్వారా శ్రీ కమలాత్మికాదేవి గురించి, వివిధ రకాలైన కమలాత్మికా మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ కమలాత్మికా అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా చేసి జయంతి చక్రవర్తిగారు అందిస్తున్నారు.
శ్రీ కమలాత్మికా సాధన జప - హోమవిధానం - స్తోత్రాలు - స్తుతులుతో సహా మనకు అందించారు. ఈ పుస్తకాన్ని ఆచరించి శ్రీ కమలాత్మికా మాత దివ్యానుగ్రహం పొందగలరని ఆశిస్తూ...
- జయంతి చక్రవర్తి
పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యలలో పదవ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకలైశ్వర్య ప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్యతిధి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక అంటే లక్ష్మిస్వరూపిణి అని అర్ధం. శాంత స్వరూపిణి అని అర్ధం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీకమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. శ్రీ కమలాత్మికా సాధన అనే ఈ పుస్తకంద్వారా శ్రీ కమలాత్మికాదేవి గురించి, వివిధ రకాలైన కమలాత్మికా మంత్రాలు గురించి, వాటి సాధనా పద్ధతుల గురించి, శ్రీ కమలాత్మికా అష్టోత్తర, సహస్త్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు వివిధ తంత్ర గ్రంధాల నుండి సేకరించిన సమాచారాన్ని ఒక సంకలనంగా చేసి జయంతి చక్రవర్తిగారు అందిస్తున్నారు. శ్రీ కమలాత్మికా సాధన జప - హోమవిధానం - స్తోత్రాలు - స్తుతులుతో సహా మనకు అందించారు. ఈ పుస్తకాన్ని ఆచరించి శ్రీ కమలాత్మికా మాత దివ్యానుగ్రహం పొందగలరని ఆశిస్తూ... - జయంతి చక్రవర్తి
© 2017,www.logili.com All Rights Reserved.