ఇవి కేవలం ఊహాజనిత కధలు కావు. సామజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామజిక చరిత్ర రచన. ఈ కధలు హైదరాబాద్ రాజ్యం చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. నవాబులు, దేవిడీలు, మహబుబ్ కీ మెహిందీ కోఠీలు, దివాన్ ఖానాలు, జనానాఖానాలు, బేగం సాహేబాలు, దుల్హన్ పాషాలు, పాన్ డాన్, పరాటాకీమా, దాల్చా, నమాజులు, పరదాల వెనుక జీవితాల్లోని సంస్కృతి, సంఘటనలు, అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా వుండేదో తెలుపుతాయి.
నెల్లూరి కేశవస్వామి(రచయిత గురించి) :
హైదరాబాద్ నగరంలో నివసిస్తూ, అక్కడి సంస్కృతిని, జీవితాలను చిత్రించిన రచయిత. 17సెప్టెంబర్, 1948న హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైనట్టు ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చు కోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం నుండి కొందరు పాకిస్తాన్ కు వెళ్ళిపోవాలని భావించారు. కొందరు వెళ్ళిపోయారు. ఈ చారిత్రక, సామజిక పరిణామాలను సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణను, నిజాం రాజ్య యుగాంత పరిణామాలను కధల రూపంలో నిక్షిప్తం చేసిన కధకుడు కేశవస్వామి.
గూడూరి సీతారాం(సంపాదకులు) :
ప్రముఖ కధా రచయిత. తెలంగాణ తొలితరం కధకుల్లో ఒకరు. 1950 - 1965మధ్య కాలంలో ఎనబైకి పైగా కధలు, రెండు నవలికలు రచించారు. వీరి కధలు 'గూడూరి సీతారాం కధలు' పేరుతో సంకలనంగా వెలువడ్డాయి.
- నెల్లూరి కేశవస్వామి
ఇవి కేవలం ఊహాజనిత కధలు కావు. సామజిక పరిణామాలకు సాహిత్య రూపం ఇచ్చిన సామజిక చరిత్ర రచన. ఈ కధలు హైదరాబాద్ రాజ్యం చరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. నవాబులు, దేవిడీలు, మహబుబ్ కీ మెహిందీ కోఠీలు, దివాన్ ఖానాలు, జనానాఖానాలు, బేగం సాహేబాలు, దుల్హన్ పాషాలు, పాన్ డాన్, పరాటాకీమా, దాల్చా, నమాజులు, పరదాల వెనుక జీవితాల్లోని సంస్కృతి, సంఘటనలు, అంతర్జాతీయ సంస్కృతి, జీవన విధానం హైదరాబాద్ రాజ్యంలో నిర్దిష్టంగా ఎలా వుండేదో తెలుపుతాయి. నెల్లూరి కేశవస్వామి(రచయిత గురించి) : హైదరాబాద్ నగరంలో నివసిస్తూ, అక్కడి సంస్కృతిని, జీవితాలను చిత్రించిన రచయిత. 17సెప్టెంబర్, 1948న హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైనట్టు ప్రకటించడం, ఒప్పందాలు కుదుర్చు కోవడం జరిగింది. హైదరాబాద్ రాజ్యం నుండి కొందరు పాకిస్తాన్ కు వెళ్ళిపోవాలని భావించారు. కొందరు వెళ్ళిపోయారు. ఈ చారిత్రక, సామజిక పరిణామాలను సంక్షుభిత సమాజాన్ని, మానసిక సంఘర్షణను, నిజాం రాజ్య యుగాంత పరిణామాలను కధల రూపంలో నిక్షిప్తం చేసిన కధకుడు కేశవస్వామి. గూడూరి సీతారాం(సంపాదకులు) : ప్రముఖ కధా రచయిత. తెలంగాణ తొలితరం కధకుల్లో ఒకరు. 1950 - 1965మధ్య కాలంలో ఎనబైకి పైగా కధలు, రెండు నవలికలు రచించారు. వీరి కధలు 'గూడూరి సీతారాం కధలు' పేరుతో సంకలనంగా వెలువడ్డాయి. - నెల్లూరి కేశవస్వామి
© 2017,www.logili.com All Rights Reserved.