స్నేహ బంధానికి మన జీవితంలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. మనల్ని చక్కగా అర్డంచేసుకొని, మన కష్ట సుఖాలను పంచుకొంటూ, మనం జీవితంలో చక్కటి బాటలో నడిచేందుకు సహాయపడే స్నేహితుడు అండగా ఉండాలని ప్రతి హృదయం కాంక్షిస్తుంది.
స్వామి వివేకానంద ప్రపంచ వ్యాప్తంగా అనేక మందితో స్నేహం చేశారు. ఆయనకు సహజంగా ఉన్న ఆకర్షణియమైన వాగ్ధాటి, మధురమైన సంభాషణా చాతుర్యం, అద్భుతమైన మానవతావాదం, విశిష్టమైన వ్యక్తిత్వం, మనోహరమైన శరీర సౌష్టవం మొదలైన గుణాలు అందరితో అవలీలగా స్నేహబంధాలను పంచుకొనేందుకు సహాయ పడ్డాయి. నిర్భయ వ్యక్తిత్వం, జన్మసిద్ధమైన పవిత్రత, అత్యున్నత ఆదర్శజీవనం సంతరించుకొన్న స్వామి వివేకానంద పటిష్టమైన స్నేహబంధాలను పెంపొందించడంలో కొన్ని విశేషమైన పద్ధతులను అవలంబించేవారు. రచయిత శ్రీ ఎ.ఆర్.కె. శర్మ ఆ పద్ధతులను అందరూ సులభంగా అర్ధం చేసుకొనేరీతిలో 11 విన్నింగ్ ఫార్ములాస్ గా ఈ పుస్తకంలో వివరించారు.
భగవంతుడితోడి తమ ఐక్యతను లోకంలోని యావన్మంది గుర్తించేవరకూ వారికి స్వామి వివేకానంద సర్వత్రా ప్రేరణ కలిగిస్తూనే ఉంటారు. ఈ పుస్తకం చదివినవారందరూ ఇందులో వివరించిన విలువలను గుర్తించి ఆదర్శప్రాయులైన స్నేహితులుగా రూపుదిద్దు కొనగలరని ఆశిస్తూ....
- ఎ.ఆర్.కె. శర్మ
స్నేహ బంధానికి మన జీవితంలో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. మనల్ని చక్కగా అర్డంచేసుకొని, మన కష్ట సుఖాలను పంచుకొంటూ, మనం జీవితంలో చక్కటి బాటలో నడిచేందుకు సహాయపడే స్నేహితుడు అండగా ఉండాలని ప్రతి హృదయం కాంక్షిస్తుంది. స్వామి వివేకానంద ప్రపంచ వ్యాప్తంగా అనేక మందితో స్నేహం చేశారు. ఆయనకు సహజంగా ఉన్న ఆకర్షణియమైన వాగ్ధాటి, మధురమైన సంభాషణా చాతుర్యం, అద్భుతమైన మానవతావాదం, విశిష్టమైన వ్యక్తిత్వం, మనోహరమైన శరీర సౌష్టవం మొదలైన గుణాలు అందరితో అవలీలగా స్నేహబంధాలను పంచుకొనేందుకు సహాయ పడ్డాయి. నిర్భయ వ్యక్తిత్వం, జన్మసిద్ధమైన పవిత్రత, అత్యున్నత ఆదర్శజీవనం సంతరించుకొన్న స్వామి వివేకానంద పటిష్టమైన స్నేహబంధాలను పెంపొందించడంలో కొన్ని విశేషమైన పద్ధతులను అవలంబించేవారు. రచయిత శ్రీ ఎ.ఆర్.కె. శర్మ ఆ పద్ధతులను అందరూ సులభంగా అర్ధం చేసుకొనేరీతిలో 11 విన్నింగ్ ఫార్ములాస్ గా ఈ పుస్తకంలో వివరించారు. భగవంతుడితోడి తమ ఐక్యతను లోకంలోని యావన్మంది గుర్తించేవరకూ వారికి స్వామి వివేకానంద సర్వత్రా ప్రేరణ కలిగిస్తూనే ఉంటారు. ఈ పుస్తకం చదివినవారందరూ ఇందులో వివరించిన విలువలను గుర్తించి ఆదర్శప్రాయులైన స్నేహితులుగా రూపుదిద్దు కొనగలరని ఆశిస్తూ.... - ఎ.ఆర్.కె. శర్మ© 2017,www.logili.com All Rights Reserved.