స్మృతి పరిధిని అధిగమించి ఆలోచించడాన్ని గురించి స్వామి వివేకానంద సృజనాత్మక బుద్దికుశలతను ఆధారంగా తీసుకొని వ్రాసిన ఈ పుస్తకం యువతరానికి చాలా స్పూర్తిదాయకంగా ఉంది. టాటా టెలి సర్వీసెస్ (టాటా డోకోమో ) లో ఎడిషనల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న శ్రీ ఏ.ఆర్.కె. శర్మ తన ఉద్యోగ వృత్తిలోని అనుభవంతో స్వామి వివేకానంద ఆలోచనా పద్ధతులను అందరికీ సులభంగా అర్ధమయ్యేరీతిలో అందిచారు.
పోటీతనం పెరుగుతున్న ఈ రోజుల్లో కేవలం డిగ్రీలను మాత్రమే సంపాదించడం వల్ల యువతరం జీవితంలో రాణించలేదు. సృజనాత్మకత బుద్ధికుశలతతో స్వయంగా ఆలోచించి నూతన పద్ధతులను ఆచరించడం, ఆ ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యసాహసాలతో ఎదుర్కొనడం మన యువతరం అలవాటు చేసుకోవాలి.
ఈ విషయంలో మనం స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని విజయ పరంపరను సాధించవచ్చు. స్వామి వివేకానంద దూర దృష్టితో భవిష్యత్ గురించి గంభీరంగా ఆలోచిస్తూ తన శిష్యులను మానవజాతికి బంగారు బాటను వెయ్యడానికి అర్హులుగా తీర్చిదిద్దారు. ఆయన చేపట్టిన ప్రతి కార్యంలోనూ సృజనాత్మకత, ఇతరలెవ్వరు అంతకు ముందు చేపట్టని క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడం, ధైర్యసాహసాలతో సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగడం మొదలైన మహోన్నత లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి.
స్వామి వివేకానంద మానవునిలో నిక్షిప్తమై ఉన్న అనంత శక్తిపై ఎంతో విశ్వాసంతో ఇలా అనేవారు, "ప్రతి మనిషి మానవకోటి వెనుక ఉన్న అపారశక్తి జ్ఞానసాగరం నుండి వెలువడుతున్న ఒక ప్రవాహం. మానవుడి కోరికలు, అవసరాలు ఉన్నాయి. వాటిని పొందే శక్తి కూడా మానావుడిలోనే ఉంది. కోరికలు, అవసరాలు, ప్రార్ధనలు నెరవేరిన పక్షంలో దివ్యపురుషులు దానికి కారణం కాదు. అది నీ అపారశక్తి నిలయం నుండే, నీలో ఉన్న సామర్ధ్యం నుండే వెలువడుతుంది."
పాఠకులు ఈ పుస్తకంలో వివరించిన పద్ధతులను అవగాహన చేసుకుని జీవిత సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకొనగలరని ఆశిస్తూ....
- ఎ.ఆర్.కె. శర్మ
స్మృతి పరిధిని అధిగమించి ఆలోచించడాన్ని గురించి స్వామి వివేకానంద సృజనాత్మక బుద్దికుశలతను ఆధారంగా తీసుకొని వ్రాసిన ఈ పుస్తకం యువతరానికి చాలా స్పూర్తిదాయకంగా ఉంది. టాటా టెలి సర్వీసెస్ (టాటా డోకోమో ) లో ఎడిషనల్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న శ్రీ ఏ.ఆర్.కె. శర్మ తన ఉద్యోగ వృత్తిలోని అనుభవంతో స్వామి వివేకానంద ఆలోచనా పద్ధతులను అందరికీ సులభంగా అర్ధమయ్యేరీతిలో అందిచారు. పోటీతనం పెరుగుతున్న ఈ రోజుల్లో కేవలం డిగ్రీలను మాత్రమే సంపాదించడం వల్ల యువతరం జీవితంలో రాణించలేదు. సృజనాత్మకత బుద్ధికుశలతతో స్వయంగా ఆలోచించి నూతన పద్ధతులను ఆచరించడం, ఆ ప్రయత్నంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యసాహసాలతో ఎదుర్కొనడం మన యువతరం అలవాటు చేసుకోవాలి. ఈ విషయంలో మనం స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని విజయ పరంపరను సాధించవచ్చు. స్వామి వివేకానంద దూర దృష్టితో భవిష్యత్ గురించి గంభీరంగా ఆలోచిస్తూ తన శిష్యులను మానవజాతికి బంగారు బాటను వెయ్యడానికి అర్హులుగా తీర్చిదిద్దారు. ఆయన చేపట్టిన ప్రతి కార్యంలోనూ సృజనాత్మకత, ఇతరలెవ్వరు అంతకు ముందు చేపట్టని క్రొత్త విధానాలను ప్రవేశపెట్టడం, ధైర్యసాహసాలతో సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగడం మొదలైన మహోన్నత లక్షణాలు ప్రస్పుటంగా కనిపిస్తాయి. స్వామి వివేకానంద మానవునిలో నిక్షిప్తమై ఉన్న అనంత శక్తిపై ఎంతో విశ్వాసంతో ఇలా అనేవారు, "ప్రతి మనిషి మానవకోటి వెనుక ఉన్న అపారశక్తి జ్ఞానసాగరం నుండి వెలువడుతున్న ఒక ప్రవాహం. మానవుడి కోరికలు, అవసరాలు ఉన్నాయి. వాటిని పొందే శక్తి కూడా మానావుడిలోనే ఉంది. కోరికలు, అవసరాలు, ప్రార్ధనలు నెరవేరిన పక్షంలో దివ్యపురుషులు దానికి కారణం కాదు. అది నీ అపారశక్తి నిలయం నుండే, నీలో ఉన్న సామర్ధ్యం నుండే వెలువడుతుంది." పాఠకులు ఈ పుస్తకంలో వివరించిన పద్ధతులను అవగాహన చేసుకుని జీవిత సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించుకొనగలరని ఆశిస్తూ.... - ఎ.ఆర్.కె. శర్మ© 2017,www.logili.com All Rights Reserved.