" నేను యోగుల కోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను... ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ ప్రవితనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్ళింది...."
ఆధ్యాత్మిక యాత్రా రచనలో రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఒక ఉదాత్త రచన. ఒక సునిశితమైన దృష్టితో ఉదార దృక్పధాన్ని మేళవించి పాల్ బ్రంటన్ భారత దేశంలో ఒక మూలనుండి మరో మూలకు తన ప్రయాణాన్ని వర్ణించాడు. ఆత్మజ్ఞానం ద్వారా వచ్చే ప్రశాంతతను తనకు ఎవరు ఇవ్వగాలరో అన్వేషిస్తూ అతను యోగులు, తాంత్రికులు, గురువుల మధ్య జీవించాడు.
అతని అన్వేషణ అరుణాచలంలో శ్రీ రమణ మహర్షితో ముగిసింది.
1898 లో జన్మించిన పాల్ బ్రంటన్ తూర్పు దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. 1935 - 1952 మధ్య 13 పుస్తకాలు ప్రచురించాడు. ధ్యానాన్ని, యోగాన్ని పశ్చిమదేశాలకు పరిచయం చేసినవాడుగా బ్రంటన్ ను గుర్తిస్తారు. అట్లాగే తాత్విక నేపధ్యం ఉన్న వీటిని అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో రచించడం కూడా బ్రంటన్ లోని విశేషం.
ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈగ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండురోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు,1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది.
దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.
" నేను యోగుల కోసం అన్వేషిస్తూ తూర్పు దిశగా ప్రయాణించాను... ఈ అన్వేషణలో భాగంగా భారతదేశ ప్రవితనదుల తీరాలలో నడయాడాను. దేశమంతా చుట్టబెట్టాను. భారతదేశం నన్ను తన హృదయంలోకి తీసుకెళ్ళింది...." ఆధ్యాత్మిక యాత్రా రచనలో రహస్యభారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ ఒక ఉదాత్త రచన. ఒక సునిశితమైన దృష్టితో ఉదార దృక్పధాన్ని మేళవించి పాల్ బ్రంటన్ భారత దేశంలో ఒక మూలనుండి మరో మూలకు తన ప్రయాణాన్ని వర్ణించాడు. ఆత్మజ్ఞానం ద్వారా వచ్చే ప్రశాంతతను తనకు ఎవరు ఇవ్వగాలరో అన్వేషిస్తూ అతను యోగులు, తాంత్రికులు, గురువుల మధ్య జీవించాడు. అతని అన్వేషణ అరుణాచలంలో శ్రీ రమణ మహర్షితో ముగిసింది. 1898 లో జన్మించిన పాల్ బ్రంటన్ తూర్పు దేశాలలో విస్తృతంగా పర్యటించాడు. 1935 - 1952 మధ్య 13 పుస్తకాలు ప్రచురించాడు. ధ్యానాన్ని, యోగాన్ని పశ్చిమదేశాలకు పరిచయం చేసినవాడుగా బ్రంటన్ ను గుర్తిస్తారు. అట్లాగే తాత్విక నేపధ్యం ఉన్న వీటిని అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో రచించడం కూడా బ్రంటన్ లోని విశేషం. ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా – మూడు లక్షల ప్రతులకు మించి అమ్ముడైన ఈగ్రంథాన్ని 1934లో మొదటిసారి ప్రచురించారు. తొలి ప్రచురణ ప్రతులన్నీ రెండురోజులలోనే అయిపోవటంతో మూడో రోజుకే రెండో ముద్రణ అవసరమైంది. అంతేకాదు,1955 సంవత్సరానికే, అంటే 20 సంవత్సరాలలోనే 18 ముద్రణలకి నోచుకున్నది. దీనినిబట్టి ఈ గ్రంథ వైశిష్ట్యమూ, ప్రాచుర్యమూ గ్రహించవచ్చు.ఎవరిలోనైనా ఆధ్యాత్మిక జాగృతి కలిగించగల పుస్తకం ఇది. ఒక విదేశీయుడు నిష్పక్షపాతంగా భారతదేశం యొక్క యోగుల గురించి నిజం గా తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. రమణమహర్షిపై,నడిచేదేవుడు చంద్రశేఖరులపై భక్తి ఉన్న వారికి ఈ పుస్తకం ఆ భక్తిని ద్విగుణీకృతం చేస్తుందనడంలో సందేహం లేదు.
నిజంగా మన దేశం యొక్క వైభవాన్ని కొంత వరకైనా తెలుసుకోవలంటే ఈ పుస్తకం చదవాలి. ఇందులోని వాస్తవికత ప్రశ్నించనవసరం లేదు. ఒక విదేశీయుడు తనకు అర్థం అయినంత వరకు ఈ సంస్కృతి గురించి వివరించిన పుస్తకం ఇది.
© 2017,www.logili.com All Rights Reserved.