ఎక్కడో ఓ మరణం
మంచం
దేహం
నడిచే దారి
జీవించే పరిసరం
అనాధ చేసి
తనువూ చాలించి
అశరిరమై
అదృశ్యమై
ప్రకటనలు లేని
సమాధానాలు రాని
నిశబ్దం
పేను దూకుడుతో
కూలిపోయి
రెక్కలు తెగి
పొగమంచు
రాత్రంతా కొరికి
ఒంటరిని చేసి
నీ మాట నీకే
విన్పించే
ఆవర్తనం
వలయం
అన్వేషించు
నా కన్నో ముక్కో మూతో చేవో చెయ్యో
మాయమైనట్టుంది
ఈ ఉదయం
కొంచెం కొంచెం కబళించి
రంద్రం రంద్రం పెకలించి
యుద్ధం ఆపేస్తూ
ఉనికిని ఎదురిస్తూ
సంతకం చెరిపేస్తూ
ఈ విరామం బహు శీతలం.
-విజయచంద్ర.
ఎక్కడో ఓ మరణం మంచం దేహం నడిచే దారి జీవించే పరిసరం అనాధ చేసి తనువూ చాలించి అశరిరమై అదృశ్యమై ప్రకటనలు లేని సమాధానాలు రాని నిశబ్దం పేను దూకుడుతో కూలిపోయి రెక్కలు తెగి పొగమంచు రాత్రంతా కొరికి ఒంటరిని చేసి నీ మాట నీకే విన్పించే ఆవర్తనం వలయం అన్వేషించు నా కన్నో ముక్కో మూతో చేవో చెయ్యో మాయమైనట్టుంది ఈ ఉదయం కొంచెం కొంచెం కబళించి రంద్రం రంద్రం పెకలించి యుద్ధం ఆపేస్తూ ఉనికిని ఎదురిస్తూ సంతకం చెరిపేస్తూ ఈ విరామం బహు శీతలం. -విజయచంద్ర.
© 2017,www.logili.com All Rights Reserved.