చిన్నప్పుడు ఆడుకున్న ఆటలకు, వృత్తిపరమైన సన్నివేశాలకు మధ్య చాలా సమాంతరాలు ఉన్నాయని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వేగంగా పని చేయటము, చురుకుతనం చూపించటము, అవసరమైన మేరకు, ఎక్కువ తక్కువలు లేకుండా, కావాల్సిన సత్తువ, బలము, వేగము, నియంత్రణ చూపించటము, జ్ఞాపకశక్తి పెంచుకోవటము, నాయకత్వము వహించటము, కావలసినప్పుడు ఒకరిని అనుసరించటము, ఒక టీంలో పని చేస్తున్నప్ప్లుడు ఒకరికొకరు ఎలా సహాయము చేసుకోవాలి, ఎలా ప్రణాలికలు వేయాలి, తోటి వారికి ఎలాంటి సహకారం అందించాలి.
సమస్య పరిష్కారానికి ఎలా వ్యూహం పన్నాలి, అవసరాలు వనరుల మధ్య సమన్వయము ఎలా తొలగించాలి, ఉన్న వనరులను సమర్థవంతముగా ఎలా వాడుకోవాలి, వనరులు లేనప్పుడు ప్రత్యామ్నాయాలు ఎలా సృష్టించుకోవాలి, లక్ష్యం సాధించే దృష్టిని ఎల్లప్పుడూ ఎలా కలిగి ఉండాలి, ఓడినా గెలిచినా జీవితాన్ని సంతోషముగా సరదాగా ఎలా గడపాలి.. ఇవన్నీ ఏ వృత్తిలోనైనా చాలా కీలకమైన నైపుణ్యాలు. ఈ లక్షణాలన్నీ మనము చిన్నప్పుడు ఆడుకున్న ఆటల్లో పుష్కలముగా లభిస్తాయి.
ఈ నేపధ్యములో, పేద విద్యార్థుల కోసం చిన్న సహాయమైనా పెద్ద మనసుతో చేసే కందుకూరి రాము గారితో, ఈ ప్రాజెక్టు గురించి చర్చించాను. అలాగే ఫేస్ బుక్ లో పెట్టిన ఒక బొమ్మ ద్వారా, దుండ్రపెల్లి బాబు పరిచయము అయ్యాడు. ఈ పుస్తకానికి బొమ్మలు గీయటానికి, ఇప్పుడిప్పుడే వికసిస్తున్న కళాకారుడు బాబు సరైన జోడి అనిపించింది. వీరిద్దరిని ఈ ప్రాజెక్టులోకి ఆహ్వానించాను. వీరిద్దరూ సమ్మతించి ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావటము నా అదృష్టముగా భావిస్తాను. ప్రతి ఆటలో, ప్రతి పుటలో, ప్రతి బొమ్మలో, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వారు పెట్టిన శ్రమ, శ్రద్ధ, ఆసక్తి, అంకిత భావము మీరందరూ ఈ పుస్తకములో చూడవచ్చు.