"భూమిక తెలుగు నాటక రంగంపై ఒక చక్కని డాక్యుమెంటరీ, మిత్రులు కందిమళ్ళ సాంబశివరావు గారు తయారు చేసిన ఒక పరిశోధనా గ్రంథం. వారు స్వతహాగా నాటక రచయిత, ప్రయోక్త, విశ్లేషకులు, విమర్శకులు, నిర్వాహకులు కూడా. అన్నిటికీ మించి అత్యంత నాటక ప్రియులు. సుమారు వందేళ్ళ తెలుగు నాటకాన్ని సంక్షిప్తంగా మనముందు ఆవిష్కరించారు. కన్యాశుల్కంతో శ్రీకారం చుట్టి, వివిధ విభాగాలలో రచింపబడిన నాటకాలు, నాటికలు, రచయితలూ, వారి కతకతాన శైలులు, నాటకరంగానికి ఇతోధిక సేవలు చేసిన నాటక సమాజాలు, పరిషత్తులు - ముఖ్యంగా ఆంద్రనాటక కళా పరిషత్తు, ప్రజానాట్యమండలి చరిత్రలు భూమికలో అపురూపంగా అలంకరింపబడ్డాయి.
నాటకం ఒక రమ్యమైన దృశ్యకావ్యం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషలలో విరాజిల్లుతున్న ఒక అపూర్వ ప్రక్రియ. సంస్కృతంలో భాసుడు, కాళిదాసు మొదలుకొని షేక్స్ పియర్, బెర్నార్డ్ షా, ఇబ్సన్ లాంటి ఎందరో మహానుభావుల నాటకాలు ఈనాటికీ దేశవిదేశాల్లో ప్రదర్శింపబడుతున్నాయి. విశ్వవిఖ్యాత నాటక రచయిత షేక్స్ పియర్ 400వ జయంతి సంవత్సరంలో సాంబశివరావు గారు సమర్పించే ఈ భూమిక తెలుగు రంగస్థలానికి ఒక విలక్షణ కానుక.
"భూమిక తెలుగు నాటక రంగంపై ఒక చక్కని డాక్యుమెంటరీ, మిత్రులు కందిమళ్ళ సాంబశివరావు గారు తయారు చేసిన ఒక పరిశోధనా గ్రంథం. వారు స్వతహాగా నాటక రచయిత, ప్రయోక్త, విశ్లేషకులు, విమర్శకులు, నిర్వాహకులు కూడా. అన్నిటికీ మించి అత్యంత నాటక ప్రియులు. సుమారు వందేళ్ళ తెలుగు నాటకాన్ని సంక్షిప్తంగా మనముందు ఆవిష్కరించారు. కన్యాశుల్కంతో శ్రీకారం చుట్టి, వివిధ విభాగాలలో రచింపబడిన నాటకాలు, నాటికలు, రచయితలూ, వారి కతకతాన శైలులు, నాటకరంగానికి ఇతోధిక సేవలు చేసిన నాటక సమాజాలు, పరిషత్తులు - ముఖ్యంగా ఆంద్రనాటక కళా పరిషత్తు, ప్రజానాట్యమండలి చరిత్రలు భూమికలో అపురూపంగా అలంకరింపబడ్డాయి. నాటకం ఒక రమ్యమైన దృశ్యకావ్యం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషలలో విరాజిల్లుతున్న ఒక అపూర్వ ప్రక్రియ. సంస్కృతంలో భాసుడు, కాళిదాసు మొదలుకొని షేక్స్ పియర్, బెర్నార్డ్ షా, ఇబ్సన్ లాంటి ఎందరో మహానుభావుల నాటకాలు ఈనాటికీ దేశవిదేశాల్లో ప్రదర్శింపబడుతున్నాయి. విశ్వవిఖ్యాత నాటక రచయిత షేక్స్ పియర్ 400వ జయంతి సంవత్సరంలో సాంబశివరావు గారు సమర్పించే ఈ భూమిక తెలుగు రంగస్థలానికి ఒక విలక్షణ కానుక.© 2017,www.logili.com All Rights Reserved.