ఆత్రేయకు మనసుకవి అన్న ముద్ర గాఢంగా పడింది. మనసును కేంద్ర బిందువుగా చేసుకొని భావగాంభీర్యమైన తాత్త్వికచింతనను అలతి అలతి పదాలతో ఓ పట్టాన అర్థంకాని, ఊహకందని, గమనమే తప్ప గమ్యమెరుగని మనస్సును అందమైన పదబంధాలలో ఇమిడ్చి, గీతాలను అందించారు. అందుకనే అందరూ ఆయన్ను మనసుకవిగానే భావించారు. నేనూ అలాంటి భావంలోనే మిగిలిపోయి ఉండగా, పైడిపాలగారు వ్రాసి, నా స్పందనకోరి పంపిన 'పాడుతా తీయగా - ఆత్రేయ నూటపదార్లు' పుస్తకం చూసి, ఆత్రేయగారి భిన్నకోణాల ప్రతిభాసంపత్తికి, ఆశ్చర్యానందాలతో, నవరాసోత్పాతంతో తడిసి ముద్దయి, కాస్త తేరుకొని ఈ నాలుగు మాటలు వ్రాస్తున్నాను. నా పరిమిత అవగాహనకు కించిత్తు మథనపడుతున్నాను. ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించబోతున్న మీకు ఆత్రేయ విశ్వరూపం, బహుముఖ ప్రావీణ్యం బాగా అవగతమవుతాయని నా ప్రగాఢ విశ్వాసం.
ఆత్రేయ నూటపదార్లులో పైడిపాలగారు ఏర్చికూర్చిన అన్ని గీతాలూ రసరమ్య దీపాలు. పైడిపాల గారు ఆత్రేయ అంతరంగంలోని సప్తవర్ణాలన్నింటినీ ఆవిష్కరించే రీతిలో ఒక క్రమంలో వర్ణవిభాగం చేశాక, అవి నేను చూశాక - నాలోని అవగాహనా రాహిత్యానికి తెరవేసుకున్నాను. ఆత్రేయ అభివ్యక్తం చేసిన నవరసాలు అన్నీ పుష్కలంగా పండి తెలుగువారి హృదయాలను రాగరంజితం చేశాయి. ఇంత వైవిధ్య భావగీతాలు బహుశా ఈ మనసుకవి - మనసున్న కవి మాత్రమే వ్రాయగలడేమో!
- వరప్రసాద్ రెడ్డి
ఆత్రేయకు మనసుకవి అన్న ముద్ర గాఢంగా పడింది. మనసును కేంద్ర బిందువుగా చేసుకొని భావగాంభీర్యమైన తాత్త్వికచింతనను అలతి అలతి పదాలతో ఓ పట్టాన అర్థంకాని, ఊహకందని, గమనమే తప్ప గమ్యమెరుగని మనస్సును అందమైన పదబంధాలలో ఇమిడ్చి, గీతాలను అందించారు. అందుకనే అందరూ ఆయన్ను మనసుకవిగానే భావించారు. నేనూ అలాంటి భావంలోనే మిగిలిపోయి ఉండగా, పైడిపాలగారు వ్రాసి, నా స్పందనకోరి పంపిన 'పాడుతా తీయగా - ఆత్రేయ నూటపదార్లు' పుస్తకం చూసి, ఆత్రేయగారి భిన్నకోణాల ప్రతిభాసంపత్తికి, ఆశ్చర్యానందాలతో, నవరాసోత్పాతంతో తడిసి ముద్దయి, కాస్త తేరుకొని ఈ నాలుగు మాటలు వ్రాస్తున్నాను. నా పరిమిత అవగాహనకు కించిత్తు మథనపడుతున్నాను. ఈ పుస్తకాన్ని చదివి ఆస్వాదించబోతున్న మీకు ఆత్రేయ విశ్వరూపం, బహుముఖ ప్రావీణ్యం బాగా అవగతమవుతాయని నా ప్రగాఢ విశ్వాసం. ఆత్రేయ నూటపదార్లులో పైడిపాలగారు ఏర్చికూర్చిన అన్ని గీతాలూ రసరమ్య దీపాలు. పైడిపాల గారు ఆత్రేయ అంతరంగంలోని సప్తవర్ణాలన్నింటినీ ఆవిష్కరించే రీతిలో ఒక క్రమంలో వర్ణవిభాగం చేశాక, అవి నేను చూశాక - నాలోని అవగాహనా రాహిత్యానికి తెరవేసుకున్నాను. ఆత్రేయ అభివ్యక్తం చేసిన నవరసాలు అన్నీ పుష్కలంగా పండి తెలుగువారి హృదయాలను రాగరంజితం చేశాయి. ఇంత వైవిధ్య భావగీతాలు బహుశా ఈ మనసుకవి - మనసున్న కవి మాత్రమే వ్రాయగలడేమో! - వరప్రసాద్ రెడ్డి
© 2017,www.logili.com All Rights Reserved.