ప్రజా హృదయం..
నీ చేతిలోని గొడుగు
అవసరమైనవారికి అడగక ముందే సంతోషంగా ఇచ్చెయ్యి
గొడుగుకంటే వాన గొప్పది
నీ చేతిలోని కర్ర
మరొకరికి ఆసరా ఇస్తుందనుకుంటే సంతోషంగా ఇచ్చెయ్యి
కర్ర సాయంకంటే కష్టమైనా
కాలూ చెయ్యీ కూడా తీసుకుని నడవటం మంచిది
నీ చేతిలోని ముద్ద
మరొకరి ఆకలి తీరుస్తుందనుకుంటే
సంతోషంగా ఆ ముద్దని వారికి తినిపించు
నిండిన కడుపు కంటే మరొకరి కడుపునింపిన అన్నం గొప్పది
ప్రాణమ్ముకంటే ప్రాణమ్ము పోసిన మృత్యువు గొప్పది
ఇన్ని మాటలాడు కవీ!
నీదాక వస్తే ఏమి చేస్తావు?
అన్నీ అందరికీ ఇవ్వగా నాకు ప్రాణమొక్కటే మిగిలినది.
అది ఇచ్చుటకు సిద్ధమైనా, వద్దు వద్దు మేలైన పనులే చేయి చేయను చుండిరి
మేలైన కవితలింకా రాయి రాయి అనుచుండిరి
కొరగాని పండు కవిగారి ప్రాణం
అతగాడి పలుకు పలుకుకు ఉప్పొంగును జనుల హృదయం
అదే చాలునతడికి అదే అతడికి ఆనందధామం..
ప్రజా హృదయం.. నీ చేతిలోని గొడుగు అవసరమైనవారికి అడగక ముందే సంతోషంగా ఇచ్చెయ్యి గొడుగుకంటే వాన గొప్పది నీ చేతిలోని కర్ర మరొకరికి ఆసరా ఇస్తుందనుకుంటే సంతోషంగా ఇచ్చెయ్యి కర్ర సాయంకంటే కష్టమైనా కాలూ చెయ్యీ కూడా తీసుకుని నడవటం మంచిది నీ చేతిలోని ముద్ద మరొకరి ఆకలి తీరుస్తుందనుకుంటే సంతోషంగా ఆ ముద్దని వారికి తినిపించు నిండిన కడుపు కంటే మరొకరి కడుపునింపిన అన్నం గొప్పది ప్రాణమ్ముకంటే ప్రాణమ్ము పోసిన మృత్యువు గొప్పది ఇన్ని మాటలాడు కవీ! నీదాక వస్తే ఏమి చేస్తావు? అన్నీ అందరికీ ఇవ్వగా నాకు ప్రాణమొక్కటే మిగిలినది. అది ఇచ్చుటకు సిద్ధమైనా, వద్దు వద్దు మేలైన పనులే చేయి చేయను చుండిరి మేలైన కవితలింకా రాయి రాయి అనుచుండిరి కొరగాని పండు కవిగారి ప్రాణం అతగాడి పలుకు పలుకుకు ఉప్పొంగును జనుల హృదయం అదే చాలునతడికి అదే అతడికి ఆనందధామం..© 2017,www.logili.com All Rights Reserved.