వొలికలబీడు
"పది దినాలనుంచీ వొగనా కొడుకూ సావలేదే. ఏ దూమో తగలగూడదా, జనాలు గుంపులు గుంపులుగా సావగూడదా. ఎంత ఎక్కువమంది సస్తే మాకంత జరుగుబాటవుతుంది. శవాలపైన ఆశ పెట్టుకోనే గదా మేం బతికేది. ఇంత పెద్ద ఊర్లో వొగ పీనిగన్నా బడకపోతే మేమబ్బా బతికేది. గంపెడు సంసారం. ఒక బిడ్డెకన్నా వల్లునిండా కప్పుకునేదానికి గుడ్డల్లే. మూడు పూట్లా కడుపునిండా గంజినీళ్లు పోసే యిదాయికమైనాలే. ఎట్లబ్బా ఈ సంసారం యేగేది?".
పొద్దున్నే తన గుడిసె ముందర కూసోని ఆలోసిస్తా వుండాడు దాసు. అదే సమీంలో ఆయప్ప యోచన్లకు గండిగొడతా ఇంట్లో పెద్ద గందరగోళం లేసింది. యోచిన చేసేదాపేసి అటుపక్క చూసినాడు. వొగిటే ఎత్తుండే ఇద్దరు పిల్లోళ్లు సిన్నమ్మి, కాశయ్య, వుండే ఒగే సొక్కాయి కోసం కొట్లాడుకుంటా వుండారు.
"రేయ్. మీ పాసులగోల. ఉండండ్రా" అంటా లేసి పోయి, పిల్లోళ్ళను ఇడిపించినాడు. సరిగ్గా అప్పుడే సేతిలో ఏదో ఎత్తుకోని పరిగెత్తుకుంటా అక్కడికి వచ్చి నిలబడినాడు పదేండ్ల బొందయ్య.
దాసు.
"ఏందిరా బొందూ అది?" అనుమానంగా అడిగినాడు దాసు. "ఏం లేదు నాయనా, ఏమీలేదు”.
చేతులు వెనక్కి పెట్టుకుని భయం భయంగా ఒగడుగు ఎనక్కేసినాడు..
"రేయ్! అబ్బోడా! నిజం సెప్పు ల్యాకుంటే శరమ్ముతీసేస్తా?” కోపంగా అన్యాడు
“అదీ! అదీ!” అంటా ఇంకొంచెం ఎనిక్కిపాయ బొందయ్య.
"వొరే నాయనా! ఇట్టియ్యిరా" అంటా వాడి సేతుల్ని లాగి సేతుల్లో వుండేది పెరుక్కున్యాడు. దాన్ని సూడంగానే దాసు కండ్లల్లో నీళ్లు తిరిగినాయి. అదేందో ఆయప్పకు తెలస్తా వున్యా. "ఏందిరా ఇదీ?” గొంతు తగ్గించి మెల్లిగా అడిగినాడు.................
* వొలికలబీడు • నవల *
వొలికలబీడు "పది దినాలనుంచీ వొగనా కొడుకూ సావలేదే. ఏ దూమో తగలగూడదా, జనాలు గుంపులు గుంపులుగా సావగూడదా. ఎంత ఎక్కువమంది సస్తే మాకంత జరుగుబాటవుతుంది. శవాలపైన ఆశ పెట్టుకోనే గదా మేం బతికేది. ఇంత పెద్ద ఊర్లో వొగ పీనిగన్నా బడకపోతే మేమబ్బా బతికేది. గంపెడు సంసారం. ఒక బిడ్డెకన్నా వల్లునిండా కప్పుకునేదానికి గుడ్డల్లే. మూడు పూట్లా కడుపునిండా గంజినీళ్లు పోసే యిదాయికమైనాలే. ఎట్లబ్బా ఈ సంసారం యేగేది?". పొద్దున్నే తన గుడిసె ముందర కూసోని ఆలోసిస్తా వుండాడు దాసు. అదే సమీంలో ఆయప్ప యోచన్లకు గండిగొడతా ఇంట్లో పెద్ద గందరగోళం లేసింది. యోచిన చేసేదాపేసి అటుపక్క చూసినాడు. వొగిటే ఎత్తుండే ఇద్దరు పిల్లోళ్లు సిన్నమ్మి, కాశయ్య, వుండే ఒగే సొక్కాయి కోసం కొట్లాడుకుంటా వుండారు. "రేయ్. మీ పాసులగోల. ఉండండ్రా" అంటా లేసి పోయి, పిల్లోళ్ళను ఇడిపించినాడు. సరిగ్గా అప్పుడే సేతిలో ఏదో ఎత్తుకోని పరిగెత్తుకుంటా అక్కడికి వచ్చి నిలబడినాడు పదేండ్ల బొందయ్య. దాసు. "ఏందిరా బొందూ అది?" అనుమానంగా అడిగినాడు దాసు. "ఏం లేదు నాయనా, ఏమీలేదు”. చేతులు వెనక్కి పెట్టుకుని భయం భయంగా ఒగడుగు ఎనక్కేసినాడు.. "రేయ్! అబ్బోడా! నిజం సెప్పు ల్యాకుంటే శరమ్ముతీసేస్తా?” కోపంగా అన్యాడు “అదీ! అదీ!” అంటా ఇంకొంచెం ఎనిక్కిపాయ బొందయ్య. "వొరే నాయనా! ఇట్టియ్యిరా" అంటా వాడి సేతుల్ని లాగి సేతుల్లో వుండేది పెరుక్కున్యాడు. దాన్ని సూడంగానే దాసు కండ్లల్లో నీళ్లు తిరిగినాయి. అదేందో ఆయప్పకు తెలస్తా వున్యా. "ఏందిరా ఇదీ?” గొంతు తగ్గించి మెల్లిగా అడిగినాడు................. * వొలికలబీడు • నవల *© 2017,www.logili.com All Rights Reserved.