రాసాని గారి 'బతుకాట' నవల నిజంగా దృశ్యకావ్యం. ఆయన శైలి, కథనం ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. పుస్తకం మొదలు పెడితే చివరివరకు ఆపకుండా చదివిస్తుంది. త్రీ - డి సినిమాలు చూసిన ప్రేక్షకులకి మామూలు సినిమాలకీ, త్రీ-డి సినిమాలకు గల తేడా అర్థమవుతుంది. త్రీ-డి చిత్రాలలో లోటు ఉంటుంది. అంటే... దృశ్యం ఒక కాన్వాస్ మీద గీసిన బొమ్మలాగా కాకుండా, మన ముందరే జరుగుతున్నట్లుంటుంది. రాసానిగారి కథనంలో ఈ త్రీ-డి ఎఫెక్టు ఉంది. చదువుతుంటే ప్రతి సంఘటనా మన కళ్ళముందే జరుగుతున్నట్లుంటుంది. ఆ పాత్రలను, సంఘటనలనూ మౌనంగా చూస్తున్న పాత్ర అయిపోతాం మనం. ఈ అద్భుత శిల్పాన్ని కథనంలో ప్రవేశపెట్టడం - ప్రజ్ఞ, ఉపజ్ఞ ఉంది, బాగా చేయి తిరిగిన రచయితకే సాధ్యం... 'బతుకాట' నాటి రంగస్థల నాటకాలకు సంబంధించిన ఒక ఎన్ సైక్లోపీడియా వంటిది.
బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాధ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు స్పష్టమవుతుంది. జగన్నాటకంలో జీవన నాటకం ఒక అంతర్భాగం. ముఖానికి రంగులేసుకొని, రంగస్థలంపైన గొంతు విప్పి 'అడుగులు' వేయకపోతే తమ బతుకు బండి ఒక అడుగు కూడా ముందుకు సాగాలేని కుటుంబాలు ఎన్నో వున్నాయి. తమ బతుకులు కొవ్వొత్తిలా కాలి, కరిగిపోతున్నా ప్రజల్ని ఆనందింప చేయడంలోనే పరమార్థాన్ని వెతుక్కునే... అసలు సిసలైన కళాకారుల యథార్థ వ్యదార్థ జీవనగమనమనే 'బతుకాట'.
- కె ఆర్ కె మోహన్
రాసాని గారి 'బతుకాట' నవల నిజంగా దృశ్యకావ్యం. ఆయన శైలి, కథనం ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. పుస్తకం మొదలు పెడితే చివరివరకు ఆపకుండా చదివిస్తుంది. త్రీ - డి సినిమాలు చూసిన ప్రేక్షకులకి మామూలు సినిమాలకీ, త్రీ-డి సినిమాలకు గల తేడా అర్థమవుతుంది. త్రీ-డి చిత్రాలలో లోటు ఉంటుంది. అంటే... దృశ్యం ఒక కాన్వాస్ మీద గీసిన బొమ్మలాగా కాకుండా, మన ముందరే జరుగుతున్నట్లుంటుంది. రాసానిగారి కథనంలో ఈ త్రీ-డి ఎఫెక్టు ఉంది. చదువుతుంటే ప్రతి సంఘటనా మన కళ్ళముందే జరుగుతున్నట్లుంటుంది. ఆ పాత్రలను, సంఘటనలనూ మౌనంగా చూస్తున్న పాత్ర అయిపోతాం మనం. ఈ అద్భుత శిల్పాన్ని కథనంలో ప్రవేశపెట్టడం - ప్రజ్ఞ, ఉపజ్ఞ ఉంది, బాగా చేయి తిరిగిన రచయితకే సాధ్యం... 'బతుకాట' నాటి రంగస్థల నాటకాలకు సంబంధించిన ఒక ఎన్ సైక్లోపీడియా వంటిది. బతుకాట పేరుకు నవలే కానీ, నిజానికి ఇది నిజమైన వ్యక్తుల జీవిత గాధ. నిజ జీవితాలను కథాత్మకంగా మలచి, నవలీకరణ చేసినట్లు స్పష్టమవుతుంది. జగన్నాటకంలో జీవన నాటకం ఒక అంతర్భాగం. ముఖానికి రంగులేసుకొని, రంగస్థలంపైన గొంతు విప్పి 'అడుగులు' వేయకపోతే తమ బతుకు బండి ఒక అడుగు కూడా ముందుకు సాగాలేని కుటుంబాలు ఎన్నో వున్నాయి. తమ బతుకులు కొవ్వొత్తిలా కాలి, కరిగిపోతున్నా ప్రజల్ని ఆనందింప చేయడంలోనే పరమార్థాన్ని వెతుక్కునే... అసలు సిసలైన కళాకారుల యథార్థ వ్యదార్థ జీవనగమనమనే 'బతుకాట'. - కె ఆర్ కె మోహన్© 2017,www.logili.com All Rights Reserved.