నూతన ఆర్ధిక విధానాలు పూలసాగును ఎగుమతులవైపు నడిపించాయి. పలు కార్పోరేట్ సంస్థలు అత్యాధునిక విధానాలలో పలురకాల పూలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతులు ప్రారంభించారు. దీనితో మరోసారి విప్లవాత్మక మార్పులు పూలసాగు, వాణిజ్యంలోకి దూసుకొచ్చాయి. చిన్న, సన్నకారు రైతులు సైతం స్థానిక మార్కెట్లకు అనువుగా పూలసాగు చేపట్టటం అధికమయింది. మరోవైపు విదేశీ కంపెనీల భాగస్వామ్యంలో అత్యాధునిక పరిజ్ఞానం పూలసాగుకు ఊపునిచ్చింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని విదేశీ మారక ద్రవ్యం ఆర్జన, వ్యాపారవేత్తల వరకు 'పూలసాగు' పై శ్రద్ధచూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రోజురోజుకు పూలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ పలు పతకాల ద్వారా పూలసాగును మరింతగా ప్రోత్సాహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఏది ఏమైనా పూలసాగులో అధిక రాబడి కోసం చిన్న, సన్నకారు రైతులు మొదలు కార్పోరేట్ సంస్థలు, ఎగుమతిదారులు నాణ్యత మీదనే దృష్టి పెట్టాలి.
- వై వెంకటేశ్వరరావు
నూతన ఆర్ధిక విధానాలు పూలసాగును ఎగుమతులవైపు నడిపించాయి. పలు కార్పోరేట్ సంస్థలు అత్యాధునిక విధానాలలో పలురకాల పూలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతులు ప్రారంభించారు. దీనితో మరోసారి విప్లవాత్మక మార్పులు పూలసాగు, వాణిజ్యంలోకి దూసుకొచ్చాయి. చిన్న, సన్నకారు రైతులు సైతం స్థానిక మార్కెట్లకు అనువుగా పూలసాగు చేపట్టటం అధికమయింది. మరోవైపు విదేశీ కంపెనీల భాగస్వామ్యంలో అత్యాధునిక పరిజ్ఞానం పూలసాగుకు ఊపునిచ్చింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని విదేశీ మారక ద్రవ్యం ఆర్జన, వ్యాపారవేత్తల వరకు 'పూలసాగు' పై శ్రద్ధచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకు పూలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ పలు పతకాల ద్వారా పూలసాగును మరింతగా ప్రోత్సాహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఏది ఏమైనా పూలసాగులో అధిక రాబడి కోసం చిన్న, సన్నకారు రైతులు మొదలు కార్పోరేట్ సంస్థలు, ఎగుమతిదారులు నాణ్యత మీదనే దృష్టి పెట్టాలి. - వై వెంకటేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.