ఈ సంపుటిలోని 25 కధలను 1918-1927 మధ్య పదేళ్ళలో 19 మంది కధకులు రచించారు. 1927 నాటికి సంఘసంస్కరనోద్యమం తగ్గుముఖంపట్టి భారతస్వాతంత్ర్యోద్యమం విజ్రుంభిస్తున్నది. సహాయ నిరాకరణోద్యమం పూర్తై ఉప్పు సత్యాగ్రహానికి, నియమోల్లంఘనోద్యమానికి ఆ ఉద్యమం విస్తరిస్తున్నది. గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేక రాజకీయ ఉద్యమం ఒకవైపు, నిర్మాణ కార్యక్రమాలు మరోవైపు ఉద్యమం రెండు పాయలుగా విస్తరిస్తూ, క్రమంగా నిర్మాణ కార్యక్రమం బలహినపడుతూ రాజకీయోద్యమం పుంజుకుంటున్నది. అయినా వలస వాద విద్య ద్వారా సంక్రమించిన సంస్కరణ భావాలు, సంఘసంస్కరనోద్యమం ప్రభావం ప్రజలలో బాగా నాటుకొని తరతరాల నుండి భారతజాతిని అణచిపెట్టిన సంఘికాచారాల నుండి, పురుషాధిపత్యం నుండి, కులమత కట్టుబాట్లు నుండి దేశం బయటపడడానికి ప్రయత్నిస్తున్నది. సాంఘిక సంస్కృతిక నిరంకుశత్వం నుండి బయటపడి విముక్తం కావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని పరిమితులున్న, అనేక పార్శ్యల నుండి సమాజం సాధ్యమైనంత ప్రజాస్వామికం కావడానికి ప్రజలు నిరంకుశ శక్తులతో సంఘర్షిస్తున్నారు. ఈ సంస్కరణే ఈ కధలలో కనిపిస్తుంది.
ఈ సంకలనంలోని కధలన్నీ కలఖండాలనీ కాదు. అట్లని మంచి కధలు లేకపోలేదు. ఇందులోని కధలన్నీ ప్రగతిశీల స్వభావం కలిగినవే కావు, ప్రగతి నిరోధకాలు ఉన్నాయి. ఏమైనా ఈ సంకనంలోని కధలు 1927 నాటి సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయనడంలో సందేహం లేదు.
డా"తవ్వా వెంకటయ్య
ఈ సంపుటిలోని 25 కధలను 1918-1927 మధ్య పదేళ్ళలో 19 మంది కధకులు రచించారు. 1927 నాటికి సంఘసంస్కరనోద్యమం తగ్గుముఖంపట్టి భారతస్వాతంత్ర్యోద్యమం విజ్రుంభిస్తున్నది. సహాయ నిరాకరణోద్యమం పూర్తై ఉప్పు సత్యాగ్రహానికి, నియమోల్లంఘనోద్యమానికి ఆ ఉద్యమం విస్తరిస్తున్నది. గాంధీజీ నాయకత్వంలో బ్రిటిష్ వ్యతిరేక రాజకీయ ఉద్యమం ఒకవైపు, నిర్మాణ కార్యక్రమాలు మరోవైపు ఉద్యమం రెండు పాయలుగా విస్తరిస్తూ, క్రమంగా నిర్మాణ కార్యక్రమం బలహినపడుతూ రాజకీయోద్యమం పుంజుకుంటున్నది. అయినా వలస వాద విద్య ద్వారా సంక్రమించిన సంస్కరణ భావాలు, సంఘసంస్కరనోద్యమం ప్రభావం ప్రజలలో బాగా నాటుకొని తరతరాల నుండి భారతజాతిని అణచిపెట్టిన సంఘికాచారాల నుండి, పురుషాధిపత్యం నుండి, కులమత కట్టుబాట్లు నుండి దేశం బయటపడడానికి ప్రయత్నిస్తున్నది. సాంఘిక సంస్కృతిక నిరంకుశత్వం నుండి బయటపడి విముక్తం కావడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ని పరిమితులున్న, అనేక పార్శ్యల నుండి సమాజం సాధ్యమైనంత ప్రజాస్వామికం కావడానికి ప్రజలు నిరంకుశ శక్తులతో సంఘర్షిస్తున్నారు. ఈ సంస్కరణే ఈ కధలలో కనిపిస్తుంది. ఈ సంకలనంలోని కధలన్నీ కలఖండాలనీ కాదు. అట్లని మంచి కధలు లేకపోలేదు. ఇందులోని కధలన్నీ ప్రగతిశీల స్వభావం కలిగినవే కావు, ప్రగతి నిరోధకాలు ఉన్నాయి. ఏమైనా ఈ సంకనంలోని కధలు 1927 నాటి సామాజిక వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయనడంలో సందేహం లేదు. డా"తవ్వా వెంకటయ్య© 2017,www.logili.com All Rights Reserved.