సామాన్యమైన పదాలతో, సరళ రీతిలో సూటిగా 'ఉన్నది ఉన్నట్లు' చెప్పిన జెన్ మాస్టర్ సియుంగ్సాన్ మాటలు జాగ్రత్తగా చదవండి. మీ మనసు మారవచ్చు; జీవితం ఒక మలుపు తిరగవచ్చు.
"నేను హాస్పిటల్ లో ఉన్నప్పుడు డాక్టర్లు నా గుండెను పరీక్షించారు. ప్రథమంగా గమనించినప్పుడు నిమిషానికి సుమారు ఎనభైసార్లు వినిపించే గుండె చప్పుళ్ళతో ఇరవై మూడు నుండి ఇరవై అయిదు పొరపాట్లు (ప్రిమెచ్యూర్ వెంట్రిక్యులర్ సంకోచాలు) సంభవిస్తున్నట్లు కనుగొన్నారు.
గుండెశక్తి క్షీణించిన రోగులు, మధుమేహంతో బాధపడే రోగులు మొదలైనవారిని పరీక్షించి పరిశోధనలు జరుపుతున్న హార్వర్డ్ ప్రొఫెసర్ ను గురించి మీరు చదివేవుంటారు. వారిలో ధ్యానాన్ని ఆచరించే రోగులనూ, ధ్యానం చేయని వారినీ పరీక్షించి విడివిడిగా లెక్కకడుతుండేవాడు. ధ్యానమెరుగనివారు, మందు తీసకుంటేనే తిన్నగా వుండేవారు; మందు తీసుకోకపోతే వారి పరిస్థితి అధ్వాన్న మవుతుండేది.
- నీలంరాజు లక్ష్మీ ప్రసాద్