1870ల నుండి ప్రారంభమైన జాతీయ పునరుజ్జీవన దశ నుండి, ఈనాటికి కాలం చాలా మారిపోయింది. తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినై. అన్నీ సామాజిక సమానతావసరాన్ని పురస్కరించుకునే వచ్చినై. తమ ప్రయోజనాల్ని ఏదో ఒక మేరకు నేరవేర్చినై. ఐతే, 1990లో ప్రపంచీకరణ వేగం పుంజుకొన్నప్పటి నుండి, అన్ని వాదాలు, అన్ని ఉద్యమాలు, భయపడవలసిన పరిస్థితులు వచ్చినై. పూర్వపు పుస్తకాలు చదువుతుంటే, వారి ఆవేదన అర్థమవుతుంది. వారి ఆలోచనలు అవగతమవుతై. ఈ మార్పులకు ఆశ్చర్యమూ, ఆవేదన తట్టుకోలేనంత ఆగ్రహ విషాదాలు కలుగుతై. అటువంటి వాటిలో సి. వి రాసిన "భారత జాతి పునరుజ్జీవనం" ఒకటి.
ఈ పుస్తకంలో మన సమాజంలోని దురాచారాలు, వాటి పరిణామాలు, సంస్కరణలు పూనుకొని సమాజాన్ని మార్చిన మహనీయులు, చారిత్రకా౦శాలు మొదలైన వాటిలో ప్రధానమైన వాటిని సి.వి చర్చించారు. అంతేగాక తన వైముఖ్యాన్ని అతి తీవ్రమైన శైలిలో చెప్పారు. ఈ పుస్తకంలో, చివర, 'కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం' అనే దీర్ఘ కవిత ఉంది. ఈ కవిత చాలా తీర్వ్రమైన శైలిలో ఉంటుంది.
- అద్దేపల్లి రామమోహనరావు
1870ల నుండి ప్రారంభమైన జాతీయ పునరుజ్జీవన దశ నుండి, ఈనాటికి కాలం చాలా మారిపోయింది. తర్వాత ఎన్నో ఉద్యమాలు వచ్చినై. అన్నీ సామాజిక సమానతావసరాన్ని పురస్కరించుకునే వచ్చినై. తమ ప్రయోజనాల్ని ఏదో ఒక మేరకు నేరవేర్చినై. ఐతే, 1990లో ప్రపంచీకరణ వేగం పుంజుకొన్నప్పటి నుండి, అన్ని వాదాలు, అన్ని ఉద్యమాలు, భయపడవలసిన పరిస్థితులు వచ్చినై. పూర్వపు పుస్తకాలు చదువుతుంటే, వారి ఆవేదన అర్థమవుతుంది. వారి ఆలోచనలు అవగతమవుతై. ఈ మార్పులకు ఆశ్చర్యమూ, ఆవేదన తట్టుకోలేనంత ఆగ్రహ విషాదాలు కలుగుతై. అటువంటి వాటిలో సి. వి రాసిన "భారత జాతి పునరుజ్జీవనం" ఒకటి. ఈ పుస్తకంలో మన సమాజంలోని దురాచారాలు, వాటి పరిణామాలు, సంస్కరణలు పూనుకొని సమాజాన్ని మార్చిన మహనీయులు, చారిత్రకా౦శాలు మొదలైన వాటిలో ప్రధానమైన వాటిని సి.వి చర్చించారు. అంతేగాక తన వైముఖ్యాన్ని అతి తీవ్రమైన శైలిలో చెప్పారు. ఈ పుస్తకంలో, చివర, 'కావాలి మనకూ ఒక సాంస్కృతిక విప్లవం' అనే దీర్ఘ కవిత ఉంది. ఈ కవిత చాలా తీర్వ్రమైన శైలిలో ఉంటుంది. - అద్దేపల్లి రామమోహనరావు
© 2017,www.logili.com All Rights Reserved.