భూమ్మీద ఉన్న చుక్క ఇలా తారాపథానికి రివ్వున ఎగుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. ఏదో పరిశోధన చేసుకున్నాడు, పాఠాలు చెప్పుకొంటున్నాడు, అక్కడక్కడ భారతీయ సనాతన ధర్మం గురించి, మన సంఘంలోని మంచి చెడ్డల గురించి సకారాత్మక దృక్పథంతో ఉపన్యాసాలిస్తున్నాడు, ఓ మంచి సామాజిక కార్యకర్త లక్షణాలతో వ్యవహరిస్తున్నాడు అనుకున్నాం. ఆ దృష్టితోనే అభినందించాం, ఆనందించాం.
కాని ఆంధ్రభూమిలో దాదాపు రెండేళ్ల క్రితం వారం వారం భాస్కరవాణి మొదలు పెట్టి ఆకాశంలోని తారాజువ్వలా వెలుగుతాడనుకోలేదు. మా యోగి ఓ అరుణ్ శౌరిని, ఓ గురుమూర్తిని మించిపోయాడన్నాను నేను మిత్రులతో...
ఈ కుల - వర్ణ - వర్గ సమాజానికి, ఈ భారత జాతికి, దేశానికి, ధర్మానికి, సంస్కృతికి నిహిత స్వార్థశక్తులు (వేస్టెడ్ ఇంట్రెస్టు ఉన్న దుర్మార్గులు) ఎంత నష్టం కలిగిస్తున్నారో జాతీయవాదులందరికీ తెలుసు. ఆ తెలిసినవారిలో కొందరు ఆవేదనతో మంచి కొరకు రాస్తూనే ఉంటారు.
- డా. పి. భాస్కరయోగి