ఈ కథలు సమాజ పునర్నిర్మాణంలో అధ్యాపకుని సృజనాత్మక పాత్రను నిర్వచిస్తున్నాయి. విద్యావ్యవస్థ బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం అధ్యాపకుడు విద్యార్థి, విద్యాప్రణాళిక - ఈ నాలుగంశాల మీద విద్యావ్యవస్థ ఆధారపడి ఉంది. ఈ వ్యవస్థలో అధ్యాపకుడు నిర్వహించగలిగిన శక్తివంతమైన పాత్రను వెంకటరమణ అద్భుతంగా ఆవిష్కరించారు.
వెంకటరమణకు విద్యద్వారా సమాజాన్ని మార్చవచ్చుననే విశ్వాసం బలంగా ఉంది. అందుకే నిబద్దులైన అధ్యాపకులు కావాలన్నది అయన ప్రతిపాదన. ఈ కథలలో క్రియాశీల అద్యాపనవైనం మనకు కనిపిస్తుంది. ప్రతిదీ వ్యాపారాత్మకం అయిపోతున్న సమయంలో అధ్యాపక వృత్తిలోని ఔన్నత్యాన్ని చాటి చెప్పారు రమణ. అధ్యాపకులంటే జీతపురాళ్ళు జేబులో వేసుకువెళ్ళేవాళ్ళు కాదని వాళ్ళు సంఘపునర్ణిర్మాతలని చాటి చెప్పారు రమణ.
ఈ సంపుటిలోని ప్రతికథను ఒక సామజిక ఆదర్శాన్ని ఒక సామజిక సత్యాన్ని చాటడానికే రాశారు వెంకటరమణ. పైపైన చుస్తే ఈ కథలన్నీ కేవలం ఆదర్శాన్ని చిత్రిస్తున్నాయనిపిస్తుంది.
కానీ ఆ ఆదర్శాలు ఆచరణసాధ్యాలే అధ్యాపకులు సామజిక చైతన్యం ఉన్నవాళ్ళైతే ఈ కథలోని అధ్యాపకులు చేసిన పనులన్నీ చేయడం సాధ్యమే........
- ఎల్. ఆర్. వెంకటరమణ