పిట్టకూనా పిట్టకూన
అమ్మపిట్ట డొక్కల్లోకి ఒదిగొదిగి
ప్రేమరెక్క కింద ముడుచుకోనిదే
నిదురతీరానికి చేరుకోలేని చిట్టికూనా
ఎలా ఉన్నావ్... అక్కడేలా ఉన్నావ్
కోసరుకున్న గోరుముద్దల్ని మరచి
ఆకలినేలా వార్చుకుంటున్నావ్
ముసురుకున్న ఒంటరితనంలో
గుండెనేలా రాటుదేల్చుకుంటున్నావ్
...............
నాకెందుకో-
మా ఊరి కాలువ గుర్తొచ్చినప్పుడల్లా
చిన్ననాటి మిత్రుడితో కలసి
కాలాన్ని వడ్డించుకున్నట్లుంటుంది
పిడచగట్టుకుపోయిన ఏ నేల గొంతులో
ప్రాణరాగమై తీగసాగాడానికో
ఏ దిగంతానికి మబ్బుతునకై
పారాణి పూయడానికో
హడావిడిగా పరుగులు పెట్టే ప్రతి కాలువ
తేనే తెమ్మెర బాల్యమై నను కమ్మేస్తుంటుంది
..........................
పిట్టకూనా పిట్టకూన అమ్మపిట్ట డొక్కల్లోకి ఒదిగొదిగి ప్రేమరెక్క కింద ముడుచుకోనిదే నిదురతీరానికి చేరుకోలేని చిట్టికూనా ఎలా ఉన్నావ్... అక్కడేలా ఉన్నావ్ కోసరుకున్న గోరుముద్దల్ని మరచి ఆకలినేలా వార్చుకుంటున్నావ్ ముసురుకున్న ఒంటరితనంలో గుండెనేలా రాటుదేల్చుకుంటున్నావ్ ............... నాకెందుకో- మా ఊరి కాలువ గుర్తొచ్చినప్పుడల్లా చిన్ననాటి మిత్రుడితో కలసి కాలాన్ని వడ్డించుకున్నట్లుంటుంది పిడచగట్టుకుపోయిన ఏ నేల గొంతులో ప్రాణరాగమై తీగసాగాడానికో ఏ దిగంతానికి మబ్బుతునకై పారాణి పూయడానికో హడావిడిగా పరుగులు పెట్టే ప్రతి కాలువ తేనే తెమ్మెర బాల్యమై నను కమ్మేస్తుంటుంది ..........................© 2017,www.logili.com All Rights Reserved.