దాదాపు మూడు దశాబ్దాల అధ్యాపక వృత్తిలో ఎందరో విద్యార్థినుల జీవితాలకు, అక్షరాలకు వెలుగును ప్రసాదించిన భారతిగారు కేవలం అద్యాపకురాలు మాత్రమే కాదు గొప్ప విదూషీమణి, రచయిత్రి కూడా. తెలుగు సాహిత్యాన్ని తన ప్రసిద్ధ రచనలతో సుసంపన్నం చేస్తూ సమకాలీన అంశాలే కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని ఆధునికులకు సరళ రచనలుగా అందించిన విద్వన్మణి. మేడం కథలన్నింటిల్లో కనిపించేది ఒక అద్యాపకురాలు 'సీత' మాత్రమే కాదు ఎందరో గురువులు, మరెందరో శిష్యులు. వారి వారి సమస్యల కడలిలో చుక్కానిపట్టి తీరం చేర్చిన తెరచాపలా సీత ఆదర్శవంతమైన 'మేడం' గా కనిపిస్తూ పాఠకులందరికీ వారివారి జీవితాల్లో దారిచూపిన మరెందరో 'మేడం' లను గుర్తుచేస్తుంది.
దాదాపు మూడు దశాబ్దాల అధ్యాపక వృత్తిలో ఎందరో విద్యార్థినుల జీవితాలకు, అక్షరాలకు వెలుగును ప్రసాదించిన భారతిగారు కేవలం అద్యాపకురాలు మాత్రమే కాదు గొప్ప విదూషీమణి, రచయిత్రి కూడా. తెలుగు సాహిత్యాన్ని తన ప్రసిద్ధ రచనలతో సుసంపన్నం చేస్తూ సమకాలీన అంశాలే కాకుండా ప్రాచీన సాహిత్యాన్ని ఆధునికులకు సరళ రచనలుగా అందించిన విద్వన్మణి. మేడం కథలన్నింటిల్లో కనిపించేది ఒక అద్యాపకురాలు 'సీత' మాత్రమే కాదు ఎందరో గురువులు, మరెందరో శిష్యులు. వారి వారి సమస్యల కడలిలో చుక్కానిపట్టి తీరం చేర్చిన తెరచాపలా సీత ఆదర్శవంతమైన 'మేడం' గా కనిపిస్తూ పాఠకులందరికీ వారివారి జీవితాల్లో దారిచూపిన మరెందరో 'మేడం' లను గుర్తుచేస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.