తిరోగమనం
నీలిరంగు ఖాదీ కుర్తా, తెలుపు రంగు పైజామాలో నుదుట మూడు అడ్డ పట్టీలతో దగ్గరనుండీ చూస్తే కానీ కనిపించనంత చిన్నపాటి పిలకతో ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తున్నా, గడియారం ముల్లులా ఊగి పోయేంతటి శరీరంతో శంకర శాస్త్రి ఉరఫ్ ప్రొఫెసర్ శంకర్ కాఫ్టేరియాలో తన వంతు కోసం ప్రాణ స్నేహితుడు ప్రభాకర్ తో మాట్లాడుతూ నిలబడ్డాడు. తన కళ్ళు, పెదవులు, చెవులు ప్రభాకర్ను పరికిస్తున్నాయే కానీ, తన ఆలోచనలు మాత్రం ఇంకో దిక్కున పరిగెడుతున్నాయి. అవి చుట్టుపక్కల ఎవరూ పట్టించుకోని, నిత్యం జరిగే ప్రహసనాన్ని, అర్థం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి.
విద్యార్థి, అధ్యాపకుల రాకపోకలతో, మాటల తూటాలతో, కప్పుల, ప్లేట్ల చప్పుళ్లతో, ఆ కాఫ్టేరియా దద్దరిల్లిపోతోంది. క్లాసుల్లో జరిగేతంతు కంటే ఇక్కడ ఎల్లప్పుడూ ఉండే ఉద్రిక్త వాతావరణమే అందరికి ఇష్టమైనది లాగుంది, ఎందుకంటే పని చేసే వాళ్ళు షిఫ్టుల్లో మారినా, దాని తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి, వాళ్ళు మాట్లాడేదంతా ఏదో వుబుసపోనివని అనుకోవచ్చు, కానీ శ్రద్ధగా వింటే అవి అర్ధంకాని వేదమంత్రాల్లా అనిపిస్తాయి. లోతుగా వాళ్ళు మాట్లాడుకొనే సబ్జెక్టు గురించి అవగాహన ఉంటే తప్పించి, అదో చెవి పక్కన జోరీగలాగ అనిపించక తప్పదు. అయినా అక్కడ ఎవరికీ వేరే వాళ్ళతో సంబంధం లేనట్టుగానే ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు మాట్లాడే వాళ్ళే వాళ్ళ లక్ష్యం. వేరే వాళ్ళు వున్నా లేనట్టే. ఆ కాఫ్టేరియాకు గాని బుర్ర ఉంటే, అది ప్రపంచంలో అతి పెద్ద మేధావి అయివుండేదేమో. అయినా రోజూ ఎప్పటికప్పడు శుభ్రంగా కడిగి తుడిచేస్తుంటే, ఆ కాఫ్టేరియా మెమరీ ఎరేస్ అవుతూ కొత్త డాటా కోసం ఎదురుచూస్తున్న సీసీటీవీ కెమెరాలా సిద్ధంగా ఉంటుంది..............
తిరోగమనం నీలిరంగు ఖాదీ కుర్తా, తెలుపు రంగు పైజామాలో నుదుట మూడు అడ్డ పట్టీలతో దగ్గరనుండీ చూస్తే కానీ కనిపించనంత చిన్నపాటి పిలకతో ఆరడుగుల రెండు అంగుళాల ఎత్తున్నా, గడియారం ముల్లులా ఊగి పోయేంతటి శరీరంతో శంకర శాస్త్రి ఉరఫ్ ప్రొఫెసర్ శంకర్ కాఫ్టేరియాలో తన వంతు కోసం ప్రాణ స్నేహితుడు ప్రభాకర్ తో మాట్లాడుతూ నిలబడ్డాడు. తన కళ్ళు, పెదవులు, చెవులు ప్రభాకర్ను పరికిస్తున్నాయే కానీ, తన ఆలోచనలు మాత్రం ఇంకో దిక్కున పరిగెడుతున్నాయి. అవి చుట్టుపక్కల ఎవరూ పట్టించుకోని, నిత్యం జరిగే ప్రహసనాన్ని, అర్థం చేసుకోవడంలో నిమగ్నమయ్యాయి. విద్యార్థి, అధ్యాపకుల రాకపోకలతో, మాటల తూటాలతో, కప్పుల, ప్లేట్ల చప్పుళ్లతో, ఆ కాఫ్టేరియా దద్దరిల్లిపోతోంది. క్లాసుల్లో జరిగేతంతు కంటే ఇక్కడ ఎల్లప్పుడూ ఉండే ఉద్రిక్త వాతావరణమే అందరికి ఇష్టమైనది లాగుంది, ఎందుకంటే పని చేసే వాళ్ళు షిఫ్టుల్లో మారినా, దాని తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి, వాళ్ళు మాట్లాడేదంతా ఏదో వుబుసపోనివని అనుకోవచ్చు, కానీ శ్రద్ధగా వింటే అవి అర్ధంకాని వేదమంత్రాల్లా అనిపిస్తాయి. లోతుగా వాళ్ళు మాట్లాడుకొనే సబ్జెక్టు గురించి అవగాహన ఉంటే తప్పించి, అదో చెవి పక్కన జోరీగలాగ అనిపించక తప్పదు. అయినా అక్కడ ఎవరికీ వేరే వాళ్ళతో సంబంధం లేనట్టుగానే ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు మాట్లాడే వాళ్ళే వాళ్ళ లక్ష్యం. వేరే వాళ్ళు వున్నా లేనట్టే. ఆ కాఫ్టేరియాకు గాని బుర్ర ఉంటే, అది ప్రపంచంలో అతి పెద్ద మేధావి అయివుండేదేమో. అయినా రోజూ ఎప్పటికప్పడు శుభ్రంగా కడిగి తుడిచేస్తుంటే, ఆ కాఫ్టేరియా మెమరీ ఎరేస్ అవుతూ కొత్త డాటా కోసం ఎదురుచూస్తున్న సీసీటీవీ కెమెరాలా సిద్ధంగా ఉంటుంది..............© 2017,www.logili.com All Rights Reserved.