మనసా వాచా కర్మణా
నిజమైన ప్రేమంటే 'ఏ వ్యక్తి సమక్షంలో మీకు సంతోషం కలుగుతుందో, ఏ వ్యక్తితో కలిసి ఉంటే మీరు పరవశించి పోతారో, ఏవరి సాన్నిధ్యంలో మీ హృదయం పులకించిపోతుందో, ఎవరి సమక్షంలో మీ మనసులో సామరస్య భావనలు కలుగుతాయో, ఏ వ్యక్తి సామీప్యం మీరు కలిసి ఉండేందుకు సహాయపడుతుందో, ఎవరి సమక్షంలో మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉంటూ వారితో మరింత కేంద్రీకృతమై వారికోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారో' అదే.
-ఓషో
“హాయ్ అజీ!" ఇంతక్రితమే అమృతం తాగి వచ్చినట్టుగా ఉంది అక్షజ స్వరం..
చటుక్కున వెనుదిరిగాను. ఆమె రూపాన్ని ఆమె నవ్వునీ చూసి వెయ్యిన్నొకటో సారి ఫిదా అయిపోయాను.
అక్షజ, మెరుపుతీగ యౌవనవతి రూపం ధరించినట్టుగా ఉంటుంది. బహుశా సరస్వతి మీద కోపం వచ్చినప్పుడు బ్రహ్మ ప్రత్యేకంగా ఈమెని సృష్టించి ఉంటాడు. ఆమె అవయవాలన్నీ ఏది ఏ పరిమాణంలో ఉండాలో అక్షరాలా కొలిచి, తూచి తయారు చేసినట్టుగా ఉంటాయి.
సంపెంగ పూవు లాంటి నాసిక. బంతిపూల లాంటి బుగ్గలు. తామర పూలలాంటి కళ్ళు, పనసతొనలే అనిపించే పెదవులు, ఇహ చూపులు చక్కెర కేళీలే. అందానికే అందనంత అందంగా ఉంటుంది. నా కళ్ళకు దేవుడు సిర్ఫ్ నా కోసమే పంపిన ప్రత్యేక గిఫ్టులా కన్పిస్తుంది.
ఆమె సౌందర్యం ఒక ఎత్తు అయితే ఆమె పెదాల మీద విరిసే అరవిరిసిన చిరునవ్వు మరో ఎత్తు.
వెన్నెల కిరణం చిట్లినట్టు, పాలనురగ పొంగినట్టు, చాంద్ కా టుకడాని పెదాలకి అతికించుకున్నట్టు ఎంతో హాయిగా చల్లగా ఆహ్లాదంగా ఉండి పరవశింపజేస్తుంది! పలవరింపజేస్తుంది. ఎంతటివారినైనా పాదాక్రాంతుణ్ణి చేస్తుంది! ఆ నవ్వుకే నేను ఫిదా అయిపోయింది!
పలాజో మీద స్ట్రెయిట్ కట్ డిజైనర్ కుర్తీ ధరించి కళకళ వెలిగిపోతోంది!............
మనసా వాచా కర్మణా నిజమైన ప్రేమంటే 'ఏ వ్యక్తి సమక్షంలో మీకు సంతోషం కలుగుతుందో, ఏ వ్యక్తితో కలిసి ఉంటే మీరు పరవశించి పోతారో, ఏవరి సాన్నిధ్యంలో మీ హృదయం పులకించిపోతుందో, ఎవరి సమక్షంలో మీ మనసులో సామరస్య భావనలు కలుగుతాయో, ఏ వ్యక్తి సామీప్యం మీరు కలిసి ఉండేందుకు సహాయపడుతుందో, ఎవరి సమక్షంలో మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉంటూ వారితో మరింత కేంద్రీకృతమై వారికోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారో' అదే. -ఓషో “హాయ్ అజీ!" ఇంతక్రితమే అమృతం తాగి వచ్చినట్టుగా ఉంది అక్షజ స్వరం.. చటుక్కున వెనుదిరిగాను. ఆమె రూపాన్ని ఆమె నవ్వునీ చూసి వెయ్యిన్నొకటో సారి ఫిదా అయిపోయాను. అక్షజ, మెరుపుతీగ యౌవనవతి రూపం ధరించినట్టుగా ఉంటుంది. బహుశా సరస్వతి మీద కోపం వచ్చినప్పుడు బ్రహ్మ ప్రత్యేకంగా ఈమెని సృష్టించి ఉంటాడు. ఆమె అవయవాలన్నీ ఏది ఏ పరిమాణంలో ఉండాలో అక్షరాలా కొలిచి, తూచి తయారు చేసినట్టుగా ఉంటాయి. సంపెంగ పూవు లాంటి నాసిక. బంతిపూల లాంటి బుగ్గలు. తామర పూలలాంటి కళ్ళు, పనసతొనలే అనిపించే పెదవులు, ఇహ చూపులు చక్కెర కేళీలే. అందానికే అందనంత అందంగా ఉంటుంది. నా కళ్ళకు దేవుడు సిర్ఫ్ నా కోసమే పంపిన ప్రత్యేక గిఫ్టులా కన్పిస్తుంది. ఆమె సౌందర్యం ఒక ఎత్తు అయితే ఆమె పెదాల మీద విరిసే అరవిరిసిన చిరునవ్వు మరో ఎత్తు. వెన్నెల కిరణం చిట్లినట్టు, పాలనురగ పొంగినట్టు, చాంద్ కా టుకడాని పెదాలకి అతికించుకున్నట్టు ఎంతో హాయిగా చల్లగా ఆహ్లాదంగా ఉండి పరవశింపజేస్తుంది! పలవరింపజేస్తుంది. ఎంతటివారినైనా పాదాక్రాంతుణ్ణి చేస్తుంది! ఆ నవ్వుకే నేను ఫిదా అయిపోయింది! పలాజో మీద స్ట్రెయిట్ కట్ డిజైనర్ కుర్తీ ధరించి కళకళ వెలిగిపోతోంది!............© 2017,www.logili.com All Rights Reserved.