జీవధార
భగీరథుడు 'ఓం గంగాయ నమః' అని జపిస్తూ ఘోర తపస్సు చేస్తున్నాడు. నారదుడు, 'నారాయణ నారాయణ' అని జపిస్తూ వచ్చాడు. చూశాడు. ఆశ్చర్యబోయాడు. పిమ్మట ఆనందపడ్డాడు.
"భగీరథీ! భగీరథా!"
భగీరథుడు కళ్ళు తెరచి చూశాడు. ప్రణామం చేశాడు. "నారద మహర్షుల వారికి అభివందనం. తమ దర్శన భాగ్యం లభించింది. ఇక నా కార్యం సానుకూల మవుతుందన్న నమ్మకం చిక్కింది”
"అది సరేనయ్యా! అయోధ్యా మహారాజు, రాజర్షి, పరమ ధార్మికుడు, మహా తేజఃశాలి అయిన నువ్వు ఏ సిరిసంపదలు, ఏ భోగభాగ్యాలు, ఏ అధికార కిరీటాలు కోరి ఇంత దీక్షగా అనితర సాధ్యంగా తపస్సు చేస్తున్నావు? ఈ భూ ప్రపంచాన్నంతా ఏక ఛత్రాధిపత్యంగా ఏలాలనా, లేక మరణాన్ని జయించే వరం కావాలనా? లేక మనలో మన మాట, రంభ, ఊర్వశులు గాఢ పరిష్వంగ సౌఖ్యం కోసమూ అమృతపానం కోసమూ
కాదు కదా?"
చెవులు మూసుకుని, "లేదు స్వామీ. అలాంటి తుచ్ఛ కోర్కెలకు బానిసను కాను” అన్నాడతడు.
"మరి ఏమి ఆశించి ఇంత కఠోర తపస్సు చేస్తున్నావయ్యా? జపం, తపం, యజ్ఞం, యాగం ఏం చేసినా ఏదో ఫలితం కోసమే, స్వార్థ ప్రయోజనార్ధమే మీ మానవులు చేస్తారుగా!”
"నేను మాత్రం మా పూర్వీకులకు పుణ్యగతులు కల్పించడానికి చేస్తున్నాను"
"భలే చిత్రంగా వుందే. నువ్వు చూడని నీ పూర్వీకులకు సద్గతి కల్పించడానికి చేస్తున్నావా! బావుందయ్యా, ఆ చేసేదేదో ఎలాంటి వరమైనా తేలికగా ఇచ్చేసే మా పితృపాదులు బ్రహ్మదేవుడి కోసమో, సర్వ సమర్థ మహాదేవుడు విష్ణుమూర్తి కోసమో,......................
జీవధార భగీరథుడు 'ఓం గంగాయ నమః' అని జపిస్తూ ఘోర తపస్సు చేస్తున్నాడు. నారదుడు, 'నారాయణ నారాయణ' అని జపిస్తూ వచ్చాడు. చూశాడు. ఆశ్చర్యబోయాడు. పిమ్మట ఆనందపడ్డాడు. "భగీరథీ! భగీరథా!" భగీరథుడు కళ్ళు తెరచి చూశాడు. ప్రణామం చేశాడు. "నారద మహర్షుల వారికి అభివందనం. తమ దర్శన భాగ్యం లభించింది. ఇక నా కార్యం సానుకూల మవుతుందన్న నమ్మకం చిక్కింది” "అది సరేనయ్యా! అయోధ్యా మహారాజు, రాజర్షి, పరమ ధార్మికుడు, మహా తేజఃశాలి అయిన నువ్వు ఏ సిరిసంపదలు, ఏ భోగభాగ్యాలు, ఏ అధికార కిరీటాలు కోరి ఇంత దీక్షగా అనితర సాధ్యంగా తపస్సు చేస్తున్నావు? ఈ భూ ప్రపంచాన్నంతా ఏక ఛత్రాధిపత్యంగా ఏలాలనా, లేక మరణాన్ని జయించే వరం కావాలనా? లేక మనలో మన మాట, రంభ, ఊర్వశులు గాఢ పరిష్వంగ సౌఖ్యం కోసమూ అమృతపానం కోసమూ కాదు కదా?" చెవులు మూసుకుని, "లేదు స్వామీ. అలాంటి తుచ్ఛ కోర్కెలకు బానిసను కాను” అన్నాడతడు. "మరి ఏమి ఆశించి ఇంత కఠోర తపస్సు చేస్తున్నావయ్యా? జపం, తపం, యజ్ఞం, యాగం ఏం చేసినా ఏదో ఫలితం కోసమే, స్వార్థ ప్రయోజనార్ధమే మీ మానవులు చేస్తారుగా!” "నేను మాత్రం మా పూర్వీకులకు పుణ్యగతులు కల్పించడానికి చేస్తున్నాను" "భలే చిత్రంగా వుందే. నువ్వు చూడని నీ పూర్వీకులకు సద్గతి కల్పించడానికి చేస్తున్నావా! బావుందయ్యా, ఆ చేసేదేదో ఎలాంటి వరమైనా తేలికగా ఇచ్చేసే మా పితృపాదులు బ్రహ్మదేవుడి కోసమో, సర్వ సమర్థ మహాదేవుడు విష్ణుమూర్తి కోసమో,......................© 2017,www.logili.com All Rights Reserved.