సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.
తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎస్.వి.రంగారావుకి ఓ విశిష్టత వుంది. ఎస్వీఆర్ అభినయం, ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు ప్రత్యేకతను కలిగి వుంటాయి. ఆయన ఎంతోమంది నటీనటులకు ఆదర్శం. తెలుగులోనే కాదు తమిళంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని నట యశస్విగా పేరు తెచ్చుకున్న ఎస్.వి.రంగారావు సమగ్ర సినీ జీవితాన్ని పుస్తకరూపంలోకి తెచ్చారు సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు.
ఎస్.వి.రంగారావుగారు నాకు దేవుడు. నా మొదటి సినిమా కథానాయకుడు. ఆయన కనక ఆ పాత్ర వేసి వుండకపోతే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయి వుండేది కాదు. ఇంత పెద్ద దర్శకుడ్ని అయ్యేవాడ్ని కాదు. తాత మనవడు చిత్రం కంటే ముందే బాగా పరిచయం. ఒక చంటిపిల్లాడి మనస్తత్వం. కోపం, తాపం నిముషమే. ఆయనతో వర్క్ చెయ్యడం చాలా హ్యాపీ. అలాంటి మహానటుడి గురించి పుస్తకం రాయడం ద్వారా, ఇక్కడికి పిలవడం ద్వారా మమ్మల్ని రీచార్జ్ చేశాడు.
- దాసరి నారాయణరావు
సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎస్.వి.రంగారావుకి ఓ విశిష్టత వుంది. ఎస్వీఆర్ అభినయం, ఆయన పోషించిన విభిన్నమైన పాత్రలు ప్రత్యేకతను కలిగి వుంటాయి. ఆయన ఎంతోమంది నటీనటులకు ఆదర్శం. తెలుగులోనే కాదు తమిళంలోనూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని నట యశస్విగా పేరు తెచ్చుకున్న ఎస్.వి.రంగారావు సమగ్ర సినీ జీవితాన్ని పుస్తకరూపంలోకి తెచ్చారు సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు. ఎస్.వి.రంగారావుగారు నాకు దేవుడు. నా మొదటి సినిమా కథానాయకుడు. ఆయన కనక ఆ పాత్ర వేసి వుండకపోతే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయి వుండేది కాదు. ఇంత పెద్ద దర్శకుడ్ని అయ్యేవాడ్ని కాదు. తాత మనవడు చిత్రం కంటే ముందే బాగా పరిచయం. ఒక చంటిపిల్లాడి మనస్తత్వం. కోపం, తాపం నిముషమే. ఆయనతో వర్క్ చెయ్యడం చాలా హ్యాపీ. అలాంటి మహానటుడి గురించి పుస్తకం రాయడం ద్వారా, ఇక్కడికి పిలవడం ద్వారా మమ్మల్ని రీచార్జ్ చేశాడు. - దాసరి నారాయణరావు© 2017,www.logili.com All Rights Reserved.