ప్రభుత్వం అనుమతి లేకుండా కార్మికులను తొలగించడానికి వీలులేదని చట్టం అంటుంది. కాని అనుమతి లేకుండానే తొలగిస్తారు. తొలగించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని చట్టం అంటుంది. ఇవ్వరు. కాంట్రాక్టు కార్మికులను నియమించడానికి లైసెన్సు పొందాలని, లైసెన్సు లేకుండా నియమించడానికి వీలులేదని చట్టం అంటుంది. లైసెన్సు లేకుండానే నియమిస్తారు. ఫలానా పనికి ఫలానా మొత్తం కనీస వేతనం ఇవ్వాలనీ, అంతకంటే తక్కువ ఇస్తే నేరమనీ చట్టం అంటుంది. తక్కువే ఇస్తారు.
ఈ చట్ట విరుద్ధమైన ప్రవర్తనను కార్మిక శాఖ నిరోధించాలి. కానీ నిరోధించలేకపోతున్నది. నిరోధించడానికి కావలసిన అన్ని అధికారాలూ వారికి లేవు. ఉన్న అధికారాలు ఉపయోగించాలన్న ఆసక్తి వారికి తరచుగా ఉండదు. అనేక ఇతర జీవిత రంగాలలో నేరాలనూ, నేరస్థులనూ అరికట్టడానికి అట్టహాసంగా శ్రమించే రాజ్యాంగ యంత్రాంగం ఈ రంగంలో మాత్రం తనకు కావలసిన అధికారాలు సమకూర్చుకోలేదు. సమకూర్చుకున్నవి కూడా వినియోగించదు. దీనిని సవరించకపోతే ఇన్ని చట్టాలుండీ కార్మికులకు దక్కగల భద్రత, హక్కులు స్వల్పమే.
ప్రభుత్వం అనుమతి లేకుండా కార్మికులను తొలగించడానికి వీలులేదని చట్టం అంటుంది. కాని అనుమతి లేకుండానే తొలగిస్తారు. తొలగించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని చట్టం అంటుంది. ఇవ్వరు. కాంట్రాక్టు కార్మికులను నియమించడానికి లైసెన్సు పొందాలని, లైసెన్సు లేకుండా నియమించడానికి వీలులేదని చట్టం అంటుంది. లైసెన్సు లేకుండానే నియమిస్తారు. ఫలానా పనికి ఫలానా మొత్తం కనీస వేతనం ఇవ్వాలనీ, అంతకంటే తక్కువ ఇస్తే నేరమనీ చట్టం అంటుంది. తక్కువే ఇస్తారు. ఈ చట్ట విరుద్ధమైన ప్రవర్తనను కార్మిక శాఖ నిరోధించాలి. కానీ నిరోధించలేకపోతున్నది. నిరోధించడానికి కావలసిన అన్ని అధికారాలూ వారికి లేవు. ఉన్న అధికారాలు ఉపయోగించాలన్న ఆసక్తి వారికి తరచుగా ఉండదు. అనేక ఇతర జీవిత రంగాలలో నేరాలనూ, నేరస్థులనూ అరికట్టడానికి అట్టహాసంగా శ్రమించే రాజ్యాంగ యంత్రాంగం ఈ రంగంలో మాత్రం తనకు కావలసిన అధికారాలు సమకూర్చుకోలేదు. సమకూర్చుకున్నవి కూడా వినియోగించదు. దీనిని సవరించకపోతే ఇన్ని చట్టాలుండీ కార్మికులకు దక్కగల భద్రత, హక్కులు స్వల్పమే.© 2017,www.logili.com All Rights Reserved.