శ్రీలంకలో జాతి సమస్య:
చారిత్రక, సామాజిక వాస్తవాలు
శ్రీలంక తమిళుల పోరాటం ఇవ్వాళో రేపో జాఫ్నా మీద జెండా ఎగరవేయబోతున్నదని కొన్నాళ్ళ కింద అనిపించింది గానీ వారి కోరిక అంత త్వరగా తీరబోయేది కాదని ఇప్పుడర్థం అవుతున్నది. జాఫ్నా ద్వీపకల్పంలోకి దాదాపు అయిదేళ్ళ విరామం తరువాత ఎల్టిఇ సాయుధ బలగాలు పునఃప్రవేశించగలిగాయి. అయితే శ్రీలంక సైన్యం అంత సులభంగా అక్కడి నుండి నిష్క్రమించే సూచనలు లేవు. సైనిక జవాన్ల ఆత్మస్థైర్యం బాగా బలహీనపడిందనీ, వారు తుపాకులు వదిలేసి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారనీ పత్రికలు మొదటి వారం రోజులు రాసాయి గానీ, వారి మనోబలాన్ని నిలబెట్టడంలో శ్రీలంక ప్రభుత్వం కృతకృత్యమయినట్టుంది.
ఎల్టిఇ సాయుధ బలగాలు అయిదేళ్ళ తరువాత పునఃప్రవేశం చేస్తున్నాయంటే అయిదేళ్ళుగా ఎల్టిఇ జాఫ్నాలో లేదని కాదు. ఏ రాజకీయ ఉద్యమమయినా భౌతికశక్తే కాక భావాల శక్తి కూడ. 'ఈలం' కాంక్ష జాఫ్నా తమిళులలో చాలా బలంగా ఉంది. మెజారిటీ ప్రజలలో ఉందని కూడ నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. వారిలో ఎల్టిఇ అభిమానులు, అనుయాయులు చాలామందే ఉన్నారు. జాఫ్నా తమిళుల జాతీయవాదానికి తానే ఏకైక ప్రతినిధి అని ఎల్టిఇ అంటుంది, కాదన్న వాళ్ళను..............
శ్రీలంకలో జాతి సమస్య: చారిత్రక, సామాజిక వాస్తవాలు శ్రీలంక తమిళుల పోరాటం ఇవ్వాళో రేపో జాఫ్నా మీద జెండా ఎగరవేయబోతున్నదని కొన్నాళ్ళ కింద అనిపించింది గానీ వారి కోరిక అంత త్వరగా తీరబోయేది కాదని ఇప్పుడర్థం అవుతున్నది. జాఫ్నా ద్వీపకల్పంలోకి దాదాపు అయిదేళ్ళ విరామం తరువాత ఎల్టిఇ సాయుధ బలగాలు పునఃప్రవేశించగలిగాయి. అయితే శ్రీలంక సైన్యం అంత సులభంగా అక్కడి నుండి నిష్క్రమించే సూచనలు లేవు. సైనిక జవాన్ల ఆత్మస్థైర్యం బాగా బలహీనపడిందనీ, వారు తుపాకులు వదిలేసి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారనీ పత్రికలు మొదటి వారం రోజులు రాసాయి గానీ, వారి మనోబలాన్ని నిలబెట్టడంలో శ్రీలంక ప్రభుత్వం కృతకృత్యమయినట్టుంది. ఎల్టిఇ సాయుధ బలగాలు అయిదేళ్ళ తరువాత పునఃప్రవేశం చేస్తున్నాయంటే అయిదేళ్ళుగా ఎల్టిఇ జాఫ్నాలో లేదని కాదు. ఏ రాజకీయ ఉద్యమమయినా భౌతికశక్తే కాక భావాల శక్తి కూడ. 'ఈలం' కాంక్ష జాఫ్నా తమిళులలో చాలా బలంగా ఉంది. మెజారిటీ ప్రజలలో ఉందని కూడ నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. వారిలో ఎల్టిఇ అభిమానులు, అనుయాయులు చాలామందే ఉన్నారు. జాఫ్నా తమిళుల జాతీయవాదానికి తానే ఏకైక ప్రతినిధి అని ఎల్టిఇ అంటుంది, కాదన్న వాళ్ళను..............© 2017,www.logili.com All Rights Reserved.