విశ్వకథా సాహిత్యాన్ని మనం ఒక విశాల సముద్రంగా భావిస్తే అందులోకి వివిధ దేశాలకు, భాషలకు చెందిన కథలు, కథానికలు వచ్చి చేరే చిన్న చిన్న పాయలుగా, నదులుగా మనకు గోచరిస్తాయి. అవన్నీ చివరికి సాహితీ సంద్రంలో ఐక్యమై కథానిక అనే ప్రక్రియను పరిపుష్టం చేస్తూ వస్తున్నాయి. ఇది సాహిత్యం సృజింపబడటం మొదలైనప్పటినుంచి నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియే! మనందరి ఎరికలోనిదే! అయితే వివిధ బాషలలో సృష్టించబడిన సాహిత్యాన్ని - అది ఏరూపంలోనిదైనా, మనం చదవాలంటే మనకు ఆ మూలభాష తెలిసి వుండాలి. లేదా ఆ కథను మనకు తెలిసిన భాషలోకి ఎవరైనా అనువాదం చేసి ఉండాలి. ప్రపంచ, మనదేశ భాషల్లోని సాహిత్యాన్నంతా మన మాతృభాషలోకో లేదా ఆంగ్ల భాషలోకో తర్జుమా చేయాలని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది.
-బి.వి. శివ ప్రసాద్.