దీపావళి
ఆరబోసినట్లు వెలుగు దివ్వెలు
ఆకాశంలో పరుచుకున్నాయి
వెన్నెల రుతుకన్నియ
కొంగుని విరజాపి
ఆ చలిరాతిరి సమయంలో
వినువీధిని కప్పేసింది
ప్రతి ఇంటికి సందేశం పంపింది.
"దీపాలను వెలిగించండి.
దీపావళి కాంతులు పంచండి
భూమాతకు కన్నుల విందు చేయండి”
పుష్పసౌరభం తోటలోంచి రాకున్నది
పిట్టల పాటలు వినపడకున్నాయి
గరికపూల సౌందర్యం నదిఒడ్డున కనపడకుంది
నైరాశ్యం కమ్మిన యీ తరుణంలో
దిగులు చీకట్లను తరిమేస్తూ
దీపావళి కాంతులు పంచండి!
వెన్నెల రేకులు వెదజల్లండి
పిల్లల్లారా!
వెలుగు దివిటీలను చేబూని
పుడమితల్లికి జేజేలు పలకండి
నింగి నుంచి దేవతలు తొంగి చూస్తున్నారు.
మీ సమర విన్యాసాలను వీక్షిస్తున్నారు.
మెరిసే వెన్నెల జెండాలు చేబూని
మిన్నెసిన ఉత్సాహంతో కదలండి!
చీకటి లోకంలో కొత్తకాంతులు నింపండి...................
© 2017,www.logili.com All Rights Reserved.