డాక్టర్ శ్రీదేవి అప్పుడప్పుడూ వ్రాసి సంపుటీకరించిన ఈ 'స్నేహిత' లో పశ్చిమ దేశాలలో పుట్టిన స్త్రీవాదం గురించి, అందులోని వివిధ ధోరణులూ, వాటిని ప్రాచుర్యం లోకి తెచ్చిన ప్రముఖ స్త్రీవాదుల గురించి, వారి తాత్వికతను గురించీ వివరిస్తూనే, తెలుగులో స్త్రీవాద ఉద్యమం పుట్టుకను, పరిమాణాన్ని చర్చించి, ప్రముఖ స్త్రీవాద కథారచయిత్రుల కథలను కూడా విశ్లేషించారు. అదనంగా మధురవాణి, సత్యభామల వ్యక్తిత్వాలను కూడా స్పృశించారు. అసలు స్త్రీవాదం ఏ ఆవశ్యకతలో నుంచీ, ఏ ఆవేదనలోనుంచీ, ఏ రూపంలో ఆవిర్భవించిందీ, ఎట్లా పరిణామంచెంది ఒక తాత్వికతను సంతరించుకొని జీవన విధానంలో భాగమైంది తెలుసుకోవలసిన అవసరం స్త్రీ పురుషులందరికీ వున్నదన్నది కొత్త సంగతేమీ కాదు. స్త్రీవాదం ఒక వాదం కాదు, అదొక తాత్వికత, ఒక జీవన విధానం, సమాజ ఆరోగ్యానికి గాలి నీరు వంటిది అనే ఎరుకను ఈ పుస్తకం కలిగించింది.
డా|| కిన్నెర శ్రీదేవి
డాక్టర్ శ్రీదేవి అప్పుడప్పుడూ వ్రాసి సంపుటీకరించిన ఈ 'స్నేహిత' లో పశ్చిమ దేశాలలో పుట్టిన స్త్రీవాదం గురించి, అందులోని వివిధ ధోరణులూ, వాటిని ప్రాచుర్యం లోకి తెచ్చిన ప్రముఖ స్త్రీవాదుల గురించి, వారి తాత్వికతను గురించీ వివరిస్తూనే, తెలుగులో స్త్రీవాద ఉద్యమం పుట్టుకను, పరిమాణాన్ని చర్చించి, ప్రముఖ స్త్రీవాద కథారచయిత్రుల కథలను కూడా విశ్లేషించారు. అదనంగా మధురవాణి, సత్యభామల వ్యక్తిత్వాలను కూడా స్పృశించారు. అసలు స్త్రీవాదం ఏ ఆవశ్యకతలో నుంచీ, ఏ ఆవేదనలోనుంచీ, ఏ రూపంలో ఆవిర్భవించిందీ, ఎట్లా పరిణామంచెంది ఒక తాత్వికతను సంతరించుకొని జీవన విధానంలో భాగమైంది తెలుసుకోవలసిన అవసరం స్త్రీ పురుషులందరికీ వున్నదన్నది కొత్త సంగతేమీ కాదు. స్త్రీవాదం ఒక వాదం కాదు, అదొక తాత్వికత, ఒక జీవన విధానం, సమాజ ఆరోగ్యానికి గాలి నీరు వంటిది అనే ఎరుకను ఈ పుస్తకం కలిగించింది. డా|| కిన్నెర శ్రీదేవి© 2017,www.logili.com All Rights Reserved.