ప్రజలే పాలకులని రాజ్యాంగం అంటుంది. ప్రజల తరపున, ప్రజా ప్రతినిధులుగా మంత్రులు పరిపాలిస్తారు. అయినా తమ పరిపాలనకు సంబంధించిన విషయాలను మాత్రం మంత్రులు ప్రజలకు వెల్లడించకూడదు. ఆ విధంగా మంత్రులు ప్రమాణం చేయాలని రాజ్యాంగం శాసిస్తుంది.
పోలైన ఓట్లలో 50 శాతం కన్నా తక్కువ ఓట్లు సాధించిన మైనారిటీ ప్రభుత్వాలే ఇంతవరకు కేంద్రంలోను, రాష్ట్రాలలోను రాజ్యమేలుతున్నాయి. మెజారిటీని మైనారిటీ పరిపాలించే మనది ఏ విధంగా ప్రజాస్వామ్యం? ఇది ప్రజల రాజ్యాంగం ఎలా అవుతుంది?
చట్టం ముందు అందరూ సమానులే అంటుంది రాజ్యాంగం. అదే సందర్భంలో చట్ట నిబంధనల నుండి ప్రభుత్వాలకు ప్రత్యేక మినహాయింపును రాజ్యాంగం కల్పించింది. ఈ విధంగా ప్రభుత్వానికి ప్రిఫరెన్షియల్ ట్రీట్ మెంట్ ఇవ్వటం రాజ్యాంగబద్ధమేనంటుంది సుప్రీంకోర్టు. చట్ట సమానత్వానికి ఇది విరుద్ధం కాదా?
ప్రభుత్వం పేరుతో జరిగే ఒప్పందాలలో ఎన్ని అవకతవకలున్నా, అందువలన ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం వాటిల్లినా, అందుకు గవర్నర్ గాని, మంత్రులు గాని, సంబంధిత అధికారులు గాని ఎవరూ బాధ్యత వహించనవసరం లేదు.
ఇప్పటికి రాజ్యాంగం 101 సార్లు సవరించబడింది. అయినా ఫలితం శూన్యం. మార్చాల్సింది రాజ్యాంగాన్నా లేక వ్యవస్థనా? రాజ్యాంగంలోని అధికరణాలు, వాటిపై న్యాయస్థానాల తీర్పులతో కూడిన సోదాహరణ విమర్శనాత్మక వ్యాఖ్యానం ఈ పుస్తకంలోని లోపలి పేజీల్లో..