పన్ను ఎగవేతను ఈ చట్టం అరికడుతుందని, నల్లధనం లేకుండా పోతుందని, పాలక వర్గాలు చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లు, కల్లబొల్లి మాటలే. ఎందుకంటే నల్లధనం వర్ధిల్లాలని, పన్నుల ఎగవేత వర్ధిల్లాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ప్రజలను ప్రలోభపెట్టి, సారాయిని ప్రవాహంలా ప్రవహింపచేసి, ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలంటే వేలకోట్ల రోపాయలు కావాలి. ఈ కోట్లాది రూపాయలంతా నల్లధనమే. పన్నులు ఎగవేయటం ద్వారా ప్రోగుపడేదే. పెట్టుబడిదారీ వర్గాలు, ఆ విధంగా కోట్లాది రూపాయల నల్లధనాన్ని, పన్ను ఎగవేసిన సొమ్మును రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇస్తాయి. అంటే నల్లధనం, అవినీతి సొమ్ము, పను ఎగవేత వర్ధిల్లాలి కదా. అందువలన ఈ చట్టం వలన నల్లధనం లేకుండా పోతుందని, పన్నుల ఎగవేత తగుతుందని ఎవరైనా భావిస్తే అది పొరబాటే.
గతంలో పన్నులకు సంబంధించి పదిహేను నుండి ఇరవైదాకా, కేంద్ర, లేక రాష్ట్రాల పన్నులు ఉండేవి. వాటిలో చాలా పన్నులు తొలగించబడి ఏకీకృత పన్నుల వ్యవస్థగా జియస్టీ రూపొందించబడింది. అందువలన ఈ చట్టం ద్వారా పన్నుల వ్యవస్థ, విధానం కొంత సరళీకృతం అయింది. ఇది మాత్రం వాస్తవం. అటువంటి చట్టాన్ని సామాన్య తెలుగు ప్రజానీకానికి సరళమైన, వ్యావహారిక తెలుగులో వివరించాలన్న మా ఆలోచనలకు అక్షర రూపమే ఇప్పుడు మీరు చదువుతున్న "కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం".
పన్ను ఎగవేతను ఈ చట్టం అరికడుతుందని, నల్లధనం లేకుండా పోతుందని, పాలక వర్గాలు చెప్పేవన్నీ కాకమ్మ కబుర్లు, కల్లబొల్లి మాటలే. ఎందుకంటే నల్లధనం వర్ధిల్లాలని, పన్నుల ఎగవేత వర్ధిల్లాలని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి. ఎందుకంటే ప్రజలను ప్రలోభపెట్టి, సారాయిని ప్రవాహంలా ప్రవహింపచేసి, ఓట్లను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలంటే వేలకోట్ల రోపాయలు కావాలి. ఈ కోట్లాది రూపాయలంతా నల్లధనమే. పన్నులు ఎగవేయటం ద్వారా ప్రోగుపడేదే. పెట్టుబడిదారీ వర్గాలు, ఆ విధంగా కోట్లాది రూపాయల నల్లధనాన్ని, పన్ను ఎగవేసిన సొమ్మును రాజకీయ పార్టీలకు విరాళాల రూపంలో ఇస్తాయి. అంటే నల్లధనం, అవినీతి సొమ్ము, పను ఎగవేత వర్ధిల్లాలి కదా. అందువలన ఈ చట్టం వలన నల్లధనం లేకుండా పోతుందని, పన్నుల ఎగవేత తగుతుందని ఎవరైనా భావిస్తే అది పొరబాటే. గతంలో పన్నులకు సంబంధించి పదిహేను నుండి ఇరవైదాకా, కేంద్ర, లేక రాష్ట్రాల పన్నులు ఉండేవి. వాటిలో చాలా పన్నులు తొలగించబడి ఏకీకృత పన్నుల వ్యవస్థగా జియస్టీ రూపొందించబడింది. అందువలన ఈ చట్టం ద్వారా పన్నుల వ్యవస్థ, విధానం కొంత సరళీకృతం అయింది. ఇది మాత్రం వాస్తవం. అటువంటి చట్టాన్ని సామాన్య తెలుగు ప్రజానీకానికి సరళమైన, వ్యావహారిక తెలుగులో వివరించాలన్న మా ఆలోచనలకు అక్షర రూపమే ఇప్పుడు మీరు చదువుతున్న "కేంద్ర వస్తువులు మరియు సేవల పన్ను చట్టం".© 2017,www.logili.com All Rights Reserved.