1901 లో మొదలైన ఈ బహుమతులు ఇప్పటి వరకూ 95(779) మంది మహిళలకు లభించాయి. అందులో శాంతి బహుమతులు 16(87), సాహిత్యానికి 14(98), వైద్యానికి 10(200), రాసాయనశాస్త్రానికి 4(168), భౌతిక శాస్త్రానికి 2(199), ఆర్ధికశాస్త్రానికి 0(76) వచ్చాయి. బ్రాకెట్లలో ఉన్న సంఖ్య పురుషులకు వచ్చిన బహుమతులు. ఈ బహుమతుల సరళి చూస్తే మహిళలకు అన్ని విభాగాల్లోనూ తక్కువగానే ఈ బహుమతులొచ్చాయన్నది ఎవరికైనా అర్థం అవుతుంది.
అయినా ఈ సరళి మరొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది - మహిళలు శాంతి ప్రధాతలని, సాహిత్యంలో ఎవరికీ తీసిపోరని, వైద్యరంగంలో రాణించగలరనిన్నూ. వైజ్ఞానిక రంగాల్లో తక్కువ ఉండటానికి కారణం, మహిళలు భార్యగా, తల్లిగా, ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకోవడంలో కోల్పోయే సమయం. ప్రయోగశాలల్లో ఎక్కువగా గడిపే సమయంగానీ వెసులుబాటు గానీ లేకపోవడం అన్నది ఎవరికైనా అర్థం అవితుంది. అయినాసరే ఈ బహుమతుల్లో పురుషులకంటే స్త్రీలు ముందున్న దృష్టాంతాలూ ఉన్నాయి. ఈ పుస్తకంలో అలా నోబెల్ బహుమతులు పొందిన 14 మంది మహిళల జీవిత విశేషాలు పొందుపరిచారు.
1901 లో మొదలైన ఈ బహుమతులు ఇప్పటి వరకూ 95(779) మంది మహిళలకు లభించాయి. అందులో శాంతి బహుమతులు 16(87), సాహిత్యానికి 14(98), వైద్యానికి 10(200), రాసాయనశాస్త్రానికి 4(168), భౌతిక శాస్త్రానికి 2(199), ఆర్ధికశాస్త్రానికి 0(76) వచ్చాయి. బ్రాకెట్లలో ఉన్న సంఖ్య పురుషులకు వచ్చిన బహుమతులు. ఈ బహుమతుల సరళి చూస్తే మహిళలకు అన్ని విభాగాల్లోనూ తక్కువగానే ఈ బహుమతులొచ్చాయన్నది ఎవరికైనా అర్థం అవుతుంది. అయినా ఈ సరళి మరొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తుంది - మహిళలు శాంతి ప్రధాతలని, సాహిత్యంలో ఎవరికీ తీసిపోరని, వైద్యరంగంలో రాణించగలరనిన్నూ. వైజ్ఞానిక రంగాల్లో తక్కువ ఉండటానికి కారణం, మహిళలు భార్యగా, తల్లిగా, ఇంటి పనుల్ని, పిల్లల్ని చూసుకోవడంలో కోల్పోయే సమయం. ప్రయోగశాలల్లో ఎక్కువగా గడిపే సమయంగానీ వెసులుబాటు గానీ లేకపోవడం అన్నది ఎవరికైనా అర్థం అవితుంది. అయినాసరే ఈ బహుమతుల్లో పురుషులకంటే స్త్రీలు ముందున్న దృష్టాంతాలూ ఉన్నాయి. ఈ పుస్తకంలో అలా నోబెల్ బహుమతులు పొందిన 14 మంది మహిళల జీవిత విశేషాలు పొందుపరిచారు.© 2017,www.logili.com All Rights Reserved.