తెలుగుసాహిత్యంలో రాయలసీమ అనంతపురంజిల్లా చిరకాలంగా తనదైన ప్రత్యేకతలు కలిగివున్న ప్రాంతం. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో సాహితీవేత్తలు, కవిపండితులు గతశతాబ్దపు తొలినాళ్ళ నుండి దశాబ్దాల తరబడి సాహిత్యంలోని కవిత్వము, కధ, వ్యాసము, విమర్శ, అవధానము వంటి అన్నిరూపాలలోనూ తమవంతు బాధ్యతను నిర్వర్తించి సాహిత్యసరస్వతిని అర్చించారు. 'అనంత సాహిత్యము - ఆధునికకవిత్వము' అన్నట్టి ప్రస్తుతరచన తెలుగుసాహిత్యరూపాల్లో కవిత్వానికి సంబంధించిన ఈ రంగంలో చిరకాలంగా అందించబడిన అంశాలను వీలయినంత సేకరించి ఈతరం సాహితీప్రియులకు పరిచయం గావించే ఒక చిన్నప్రయత్నం.
ప్రసిద్ధసాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి ఒక సందర్భంగా అన్నట్టు 'వ్యావహారికభాషకు సంబంధించిన యుద్ధాలు జరిగే రోజుల్లో రాయలసీమలో కవిపండితులు గ్రాంధికభాషావాదులుగానే వుండిపోయిన సాహితీవాతావరణం ఇక్కడ చాలాకాలంగా వుండటం ఫలితంగా సీమకవిత్వం, సీమకవులూ బహుశా తనదైన సముచితస్థానం పొందలేకపోయాయేమో అని అనాల్సివుంటుంది. అంతేకాదు అవధానవిద్యకు సైతం ఈ ప్రాంతంలో విశేషప్రాచుర్యం వుంది. కారణాలు ఏవయినప్పటికిని ఆధునికకవిత్వమూ, దానికి సంబంధించిన రచయితలూ అనంతసాహితీసీమలో దాదాపుగా తాముపొందాల్సిన చలనశీలత్వాన్ని పొందలేకపోయాయి'. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెలువడుతున్న ఈరచన సీఎమసాహిత్యాన్ని, అనంతసాహితీసీమలోని కవిత్వధోరణులను స్తాలీపులాకన్యాయంగా పాఠకులకు వీలయినన్ని అంశాలను పరిచయం గావిస్తుంది అనవచ్చు.
తెలుగుసాహిత్యంలో రాయలసీమ అనంతపురంజిల్లా చిరకాలంగా తనదైన ప్రత్యేకతలు కలిగివున్న ప్రాంతం. ఈ ప్రాంతానికి చెందిన ఎందరో సాహితీవేత్తలు, కవిపండితులు గతశతాబ్దపు తొలినాళ్ళ నుండి దశాబ్దాల తరబడి సాహిత్యంలోని కవిత్వము, కధ, వ్యాసము, విమర్శ, అవధానము వంటి అన్నిరూపాలలోనూ తమవంతు బాధ్యతను నిర్వర్తించి సాహిత్యసరస్వతిని అర్చించారు. 'అనంత సాహిత్యము - ఆధునికకవిత్వము' అన్నట్టి ప్రస్తుతరచన తెలుగుసాహిత్యరూపాల్లో కవిత్వానికి సంబంధించిన ఈ రంగంలో చిరకాలంగా అందించబడిన అంశాలను వీలయినంత సేకరించి ఈతరం సాహితీప్రియులకు పరిచయం గావించే ఒక చిన్నప్రయత్నం. ప్రసిద్ధసాహిత్య విమర్శకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి ఒక సందర్భంగా అన్నట్టు 'వ్యావహారికభాషకు సంబంధించిన యుద్ధాలు జరిగే రోజుల్లో రాయలసీమలో కవిపండితులు గ్రాంధికభాషావాదులుగానే వుండిపోయిన సాహితీవాతావరణం ఇక్కడ చాలాకాలంగా వుండటం ఫలితంగా సీమకవిత్వం, సీమకవులూ బహుశా తనదైన సముచితస్థానం పొందలేకపోయాయేమో అని అనాల్సివుంటుంది. అంతేకాదు అవధానవిద్యకు సైతం ఈ ప్రాంతంలో విశేషప్రాచుర్యం వుంది. కారణాలు ఏవయినప్పటికిని ఆధునికకవిత్వమూ, దానికి సంబంధించిన రచయితలూ అనంతసాహితీసీమలో దాదాపుగా తాముపొందాల్సిన చలనశీలత్వాన్ని పొందలేకపోయాయి'. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వెలువడుతున్న ఈరచన సీఎమసాహిత్యాన్ని, అనంతసాహితీసీమలోని కవిత్వధోరణులను స్తాలీపులాకన్యాయంగా పాఠకులకు వీలయినన్ని అంశాలను పరిచయం గావిస్తుంది అనవచ్చు.© 2017,www.logili.com All Rights Reserved.