ఈ పుస్తకంలోని వ్యాసాలూ అవసరం తన్నుకుని వచ్చినప్పుడు తప్పనిసరి అయి రాసినవే గాని పట్టుమని కూర్చుని నికరంగా రాసినవి కావు. వీటి మాదిరినే ఎన్నో ఏళ్లుగా గాలిస్తూ వస్తున్న 'విజయనగరం భాష' పై ఉన్న ఆలోచనల తుట్టేలతో రూడిపడిన ఒక పంథా లోలోన దాగి ఉంది. ఆ అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తెప్పించగల ఏదోక సందర్భం అనువుపడి ఉండినట్లయితే మరో పరిశోధక వ్యాసం వీటికి జతపడి ఉండేది. ఉన్న ఈ కొద్ది వ్యాసాలైనా పత్రికల, ఆకాశవాని సాహిత్య సంచిక కార్యక్రమాల సౌజన్యంతో వెలువడ్డవే.
ఒక విధంగా ఈ వ్యాసాలూ సాహిత్య కృషీవలులు కొత్త పంటకోసం ఎలాంటి విత్తులు వినియోగించాలో నిర్దేశించే పొలాల వంటివి. వీటిలో సాగుచేసిన పైరును ఇలా రాశి పోయవచ్చు. చంద్రహాస, సౌదామిని, ఆంద్ర క్షత్రియుల చరిత్ర అలభ్యగ్రంథాలు. ప్రబంధం పిడిగ్రీస్, 'దాతుపట్టిక' వారి ఆముద్రిత రచనలు. "రామానుజ గురుస్తోత్రం గురజాడను సంస్కృత కవిగా నిరూపించే రచన, బహుజనపల్లి సీతారామాచార్యుల వ్యవహారిక భాషను మొదటగా గుర్తింపచేసింది గురజాడే, గురజాడ కథానికలలోని సామాజిక స్పృహకు మూలాలు ప్రాంతీయ చారిత్రిక ఘటనలే, గురజాడ రచనల పరిష్కర్త, వివరణాకర్త అయిన అవసరాల సూర్యారావు గురజాడకు 'మల్లినాథసూరి' వంటివాడు, గురజాడ తారాడిన విజయనగర సంస్థానం చరిత్ర సంస్కృతికి అవలంబమైనవి కోట కట్టడ వృత్తాంతాలు" అనేవి ఈ సంపుటిలోని బెళుకులు.
ఈ పుస్తకంలోని వ్యాసాలూ అవసరం తన్నుకుని వచ్చినప్పుడు తప్పనిసరి అయి రాసినవే గాని పట్టుమని కూర్చుని నికరంగా రాసినవి కావు. వీటి మాదిరినే ఎన్నో ఏళ్లుగా గాలిస్తూ వస్తున్న 'విజయనగరం భాష' పై ఉన్న ఆలోచనల తుట్టేలతో రూడిపడిన ఒక పంథా లోలోన దాగి ఉంది. ఆ అంతర్గత సామర్థ్యాన్ని వెలికి తెప్పించగల ఏదోక సందర్భం అనువుపడి ఉండినట్లయితే మరో పరిశోధక వ్యాసం వీటికి జతపడి ఉండేది. ఉన్న ఈ కొద్ది వ్యాసాలైనా పత్రికల, ఆకాశవాని సాహిత్య సంచిక కార్యక్రమాల సౌజన్యంతో వెలువడ్డవే. ఒక విధంగా ఈ వ్యాసాలూ సాహిత్య కృషీవలులు కొత్త పంటకోసం ఎలాంటి విత్తులు వినియోగించాలో నిర్దేశించే పొలాల వంటివి. వీటిలో సాగుచేసిన పైరును ఇలా రాశి పోయవచ్చు. చంద్రహాస, సౌదామిని, ఆంద్ర క్షత్రియుల చరిత్ర అలభ్యగ్రంథాలు. ప్రబంధం పిడిగ్రీస్, 'దాతుపట్టిక' వారి ఆముద్రిత రచనలు. "రామానుజ గురుస్తోత్రం గురజాడను సంస్కృత కవిగా నిరూపించే రచన, బహుజనపల్లి సీతారామాచార్యుల వ్యవహారిక భాషను మొదటగా గుర్తింపచేసింది గురజాడే, గురజాడ కథానికలలోని సామాజిక స్పృహకు మూలాలు ప్రాంతీయ చారిత్రిక ఘటనలే, గురజాడ రచనల పరిష్కర్త, వివరణాకర్త అయిన అవసరాల సూర్యారావు గురజాడకు 'మల్లినాథసూరి' వంటివాడు, గురజాడ తారాడిన విజయనగర సంస్థానం చరిత్ర సంస్కృతికి అవలంబమైనవి కోట కట్టడ వృత్తాంతాలు" అనేవి ఈ సంపుటిలోని బెళుకులు.© 2017,www.logili.com All Rights Reserved.