భోజనం పూర్తయి చేతులు కడుక్కుని సోఫాలో కూర్చున్నారు. అప్పుడు నోరు విప్పింది ఆమె. "నీకొక విషయం తెలుసా! మన ముగ్గురి పేర్లలో ఎంత సాపత్యం ఉందో! అందుకే మన మధ్య బంధం కూడా ఏర్పడి ఉంటుంది. నీ సంశయాల చిక్కుముడి విప్పుతున్నాను కాచుకో. బైదిబై నా పేరు మాధవి. నేను మధుకర్ ప్రధమ పత్నిని. మన ముగ్గురి పేర్లలో మధువు ఉంది. మాధవి అంటే నిఘంటువు ప్రకారం తేనె, చక్కెర. మధురిమ అంటే తియ్యనైనది. మధుకర్ అంటే శ్రీకృష్ణుడి పేరు. ఇంకో అర్ధం తుమ్మెద అని కూడా ఉంది. తుమ్మెదకు తీపి అంటే ఇష్టం. అందుకే రకరకాల పువ్వుల మీద వాలి మధువును సేకరిస్తుంది. ఆ పేరును సార్ధకం చేసుకునేందుకు కాబోలు ఆడవాళ్ళను వాడుకుంటున్నట్టున్నాడు."