చక్రవాళం నవల ఎన్నో విధాలుగా ఉత్తమమైన నవల! ఈ నవలలో ప్రతి పాత్ర మనకి సన్నిహితంగా కనిపించే వ్యక్తులే అన్న భావన కలుగుతుంది. అతి సామాన్యమైన కుటుంబాలు బ్రతుకు తెరువుకోసం నగరాలు వచ్చి స్థిరపడి, జీవితంలో ఏ విధంగా ఉన్నతస్థితికి చేరుకున్నారో ఈ నవలలో చక్కగా వివరించారు. రాంజీ, సునీత వారి అంతస్థులవల్ల, ఆర్ధిక తారతమ్యాల వల్ల జీవితంలో ఎంత ఎడబాటుకి లోనయ్యాలో, వారి జీవితాలు ఎలా మలుపులతో విచిత్ర పరిస్థితులకి లోనయ్యారో చదువుతున్నంతసేపూ ఉత్కంఠ రేకెత్తించేలా రచించారు. నారాయణమూర్తి, రాంజీ ఫ్రెండ్, అంజిబాబు మన మధ్య మసిలే మనుషులే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో స్థిరపడి 'హౌస్ ఆఫ్ లార్డ్స్' సభ్యుడిగా బ్రిటీష్ ప్రభుత్వంచే నియమింపబడిన భూపతిగారి గొప్ప వ్యక్తిత్వం మనని ఆనందింపజేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ చైర్మన్ పదవి నుండి, మంత్రి పదవి దాక ఎదిగిన కోదండరాం గారి స్వభావం సహజమే అనిపిస్తుంది. ఈ రెండు పాత్రల్నీ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక దిశానిర్దేశం లేక, ఆలనా పాలనా లేక, విచిత్రమైన మనస్తత్వంతో ప్రవర్తించే సునీతకి భూపతిగారు తండ్రివంటి ఆప్యాయతతో ఆమెని చేరదీసి, సత్ప్రవర్తన కలిగించడం కూడా మనకి ఆనందం కలిగిస్తుంది. ఇంగ్లాండుని కళ్ళకి కట్టినట్టు వర్ణించిన తీరు బాగుంది. ఈ నవలలో సంఘటనలు మనం ఊహించలేనివి! చదివిన కొద్దీ ఆనందం, ఆశ్చర్యం కలిగించే ఉత్తమమైన నవల చక్రవాళం! ఇంత మంచి నవల రాసినందుకు శ్రీ వ్యాకరణం అచ్యుతరామారావు గారిని మనసారా అభినందిస్తున్నాను.
- తనికెళ్ళ భరణి
చక్రవాళం నవల ఎన్నో విధాలుగా ఉత్తమమైన నవల! ఈ నవలలో ప్రతి పాత్ర మనకి సన్నిహితంగా కనిపించే వ్యక్తులే అన్న భావన కలుగుతుంది. అతి సామాన్యమైన కుటుంబాలు బ్రతుకు తెరువుకోసం నగరాలు వచ్చి స్థిరపడి, జీవితంలో ఏ విధంగా ఉన్నతస్థితికి చేరుకున్నారో ఈ నవలలో చక్కగా వివరించారు. రాంజీ, సునీత వారి అంతస్థులవల్ల, ఆర్ధిక తారతమ్యాల వల్ల జీవితంలో ఎంత ఎడబాటుకి లోనయ్యాలో, వారి జీవితాలు ఎలా మలుపులతో విచిత్ర పరిస్థితులకి లోనయ్యారో చదువుతున్నంతసేపూ ఉత్కంఠ రేకెత్తించేలా రచించారు. నారాయణమూర్తి, రాంజీ ఫ్రెండ్, అంజిబాబు మన మధ్య మసిలే మనుషులే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో స్థిరపడి 'హౌస్ ఆఫ్ లార్డ్స్' సభ్యుడిగా బ్రిటీష్ ప్రభుత్వంచే నియమింపబడిన భూపతిగారి గొప్ప వ్యక్తిత్వం మనని ఆనందింపజేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో మునిసిపల్ చైర్మన్ పదవి నుండి, మంత్రి పదవి దాక ఎదిగిన కోదండరాం గారి స్వభావం సహజమే అనిపిస్తుంది. ఈ రెండు పాత్రల్నీ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఒక దిశానిర్దేశం లేక, ఆలనా పాలనా లేక, విచిత్రమైన మనస్తత్వంతో ప్రవర్తించే సునీతకి భూపతిగారు తండ్రివంటి ఆప్యాయతతో ఆమెని చేరదీసి, సత్ప్రవర్తన కలిగించడం కూడా మనకి ఆనందం కలిగిస్తుంది. ఇంగ్లాండుని కళ్ళకి కట్టినట్టు వర్ణించిన తీరు బాగుంది. ఈ నవలలో సంఘటనలు మనం ఊహించలేనివి! చదివిన కొద్దీ ఆనందం, ఆశ్చర్యం కలిగించే ఉత్తమమైన నవల చక్రవాళం! ఇంత మంచి నవల రాసినందుకు శ్రీ వ్యాకరణం అచ్యుతరామారావు గారిని మనసారా అభినందిస్తున్నాను. - తనికెళ్ళ భరణి© 2017,www.logili.com All Rights Reserved.