ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వలతార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్విక చర్చ వంటి రంగాలలో విశ్లేషణాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు 11. ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యాన్ని సృజించిన తెలుగు రచయితలలో కుటుంబరావుది అగ్రస్థానం. ఆ రచనా | ప్రపంచం | రాశిలోనేగాక, వాసిలోనూ, వస్తు శిల్పాలలోనూ, "శైలిలోనూ, పాఠకుల ఆలోచనలను ప్రేరేపించడంలోనూ కూడా అసాధారణమైనది. ఆయన తన కాలపు సామాజిక జీవనంలోని చీకటి వెలుగులను వివరించారు. మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ, నీచత్వాన్నీ విశ్లేషించారు. ఆ వివరణ, విశ్లేషణ అన్ని కోణాల నుంచీ, అన్ని స్థాయిల నుంచీ లోతుగా సాగాయి. అలా పాఠకుల చైతన్యాన్నీ, అవగాహనలనూ ఉన్నతీకరి చడానికి ఆయన చేసిన ప్రయత్నం అనితరసాధ్యమైనది. అనువాదాలు కాక ఎనిమిది వేల పేజీల దాకా విస్తరించిన కుటుంబరావు రచనా ప్రపంచం తెలుగు సమాజ సాహిత్యాల జ్ఞాన సంపద. ఈ మొత్తాన్నీ 2009లో పదహారు సంపుటాలుగా విప్లవ రచయితల సంఘం ప్రచురించింది. ఇప్పుడు మళ్లీ కల్పనా సాహిత్యం తొమ్మిది సంపుటాలను పునర్ముద్రిస్తున్నది...................
ఇరవయో శతాబ్ది తెలుగు సాహిత్యాకాశంలో ఉజ్వలతార కొడవటిగంటి కుటుంబరావు (1909-1980). కథ, నవల, నాటిక, గల్పిక వంటి సృజనాత్మక ప్రక్రియలు, సైన్స్, చరిత్ర, సంస్కృతి, సినిమా, సాహిత్యం, రాజకీయాలు, తాత్విక చర్చ వంటి రంగాలలో విశ్లేషణాత్మక రచనలు, అనువాదాలు, వందలాది మంది మిత్రులకు 11. ఉత్తరాలు - అన్నీ కలిపి రాశిలో గణనీయమైన సాహిత్యాన్ని సృజించిన తెలుగు రచయితలలో కుటుంబరావుది అగ్రస్థానం. ఆ రచనా | ప్రపంచం | రాశిలోనేగాక, వాసిలోనూ, వస్తు శిల్పాలలోనూ, "శైలిలోనూ, పాఠకుల ఆలోచనలను ప్రేరేపించడంలోనూ కూడా అసాధారణమైనది. ఆయన తన కాలపు సామాజిక జీవనంలోని చీకటి వెలుగులను వివరించారు. మధ్య తరగతి జీవితంలోని ఆనంద విషాదాలనూ, ఉదాత్తతనూ, నీచత్వాన్నీ విశ్లేషించారు. ఆ వివరణ, విశ్లేషణ అన్ని కోణాల నుంచీ, అన్ని స్థాయిల నుంచీ లోతుగా సాగాయి. అలా పాఠకుల చైతన్యాన్నీ, అవగాహనలనూ ఉన్నతీకరి చడానికి ఆయన చేసిన ప్రయత్నం అనితరసాధ్యమైనది. అనువాదాలు కాక ఎనిమిది వేల పేజీల దాకా విస్తరించిన కుటుంబరావు రచనా ప్రపంచం తెలుగు సమాజ సాహిత్యాల జ్ఞాన సంపద. ఈ మొత్తాన్నీ 2009లో పదహారు సంపుటాలుగా విప్లవ రచయితల సంఘం ప్రచురించింది. ఇప్పుడు మళ్లీ కల్పనా సాహిత్యం తొమ్మిది సంపుటాలను పునర్ముద్రిస్తున్నది...................© 2017,www.logili.com All Rights Reserved.