అమ్మ చుట్టూ తిరిగే అందమయిన కాలం బాల్యం. మరపురానిది. మధురమయినది. మరలిరానిది. లాలపోసే అమ్మ. జోల పాడే అమ్మ. ఎత్తుకునే అమ్మ. గుండెకు హత్తుకునే అమ్మ. కొసరి కొసరి తినిపించే గోరు ముద్దలు. అడిగి అడిగి పెట్టె తీయనైన ముద్దులు. ఉయ్యాల ఊపుతూ ఊసులు చెబుతుంది. నడకలతో పాటు మంచి నడతను నేర్పుతుంది. చేయి పట్టుకుని నడిపిస్తుంది. చేయకూడని పనులేవో, చేయతగిన పనులేవో విడమరచి చెబుతుంది. పెట్టినా, కోపమొచ్చి తిట్టినా ప్రేమను కురిపిస్తుంది. లోకం మరిపిస్తుంది. బుద్దులు చెబుతూ సుద్దులు నేర్పే తొలి బడి కదా అమ్మ ఒడి.. కని, పెంచే, కనిపించే దేవత కదా అమ్మంటే...
అలాంట్ అమ్మ గురించి చెప్పే ఒక అందమయిన పుస్తకం ఇది. ఇందులో ఏ పేజీ చదివినా అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడుస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మ చూపుడు వేలు చూపించే సరికొత్త లోకమేదో చూస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మ చెప్పే ఊసులు వింటున్నట్టుగా ఉంటుంది. అమ్మ ఇచ్చే కమ్మని మిఠాయి తింటున్నట్టుగానూ ఉంటుంది. 'నా బంగారు కొండా' అని అమ్మ ముద్దు చేస్తున్నట్టుగా ఉంటుంది.
అమ్మ చుట్టూ తిరిగే అందమయిన కాలం బాల్యం. మరపురానిది. మధురమయినది. మరలిరానిది. లాలపోసే అమ్మ. జోల పాడే అమ్మ. ఎత్తుకునే అమ్మ. గుండెకు హత్తుకునే అమ్మ. కొసరి కొసరి తినిపించే గోరు ముద్దలు. అడిగి అడిగి పెట్టె తీయనైన ముద్దులు. ఉయ్యాల ఊపుతూ ఊసులు చెబుతుంది. నడకలతో పాటు మంచి నడతను నేర్పుతుంది. చేయి పట్టుకుని నడిపిస్తుంది. చేయకూడని పనులేవో, చేయతగిన పనులేవో విడమరచి చెబుతుంది. పెట్టినా, కోపమొచ్చి తిట్టినా ప్రేమను కురిపిస్తుంది. లోకం మరిపిస్తుంది. బుద్దులు చెబుతూ సుద్దులు నేర్పే తొలి బడి కదా అమ్మ ఒడి.. కని, పెంచే, కనిపించే దేవత కదా అమ్మంటే... అలాంట్ అమ్మ గురించి చెప్పే ఒక అందమయిన పుస్తకం ఇది. ఇందులో ఏ పేజీ చదివినా అమ్మ చిటికెన వేలు పట్టుకుని నడుస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మ చూపుడు వేలు చూపించే సరికొత్త లోకమేదో చూస్తున్నట్టుగా ఉంటుంది. అమ్మ చెప్పే ఊసులు వింటున్నట్టుగా ఉంటుంది. అమ్మ ఇచ్చే కమ్మని మిఠాయి తింటున్నట్టుగానూ ఉంటుంది. 'నా బంగారు కొండా' అని అమ్మ ముద్దు చేస్తున్నట్టుగా ఉంటుంది.© 2017,www.logili.com All Rights Reserved.