ఈ ప్రపంచంలో పిడికెడు ఓదార్పు, సానుభూతిగా చారెడు కన్నీరు దొరకడం కష్టం. ఎవరిని ఎవరూ ప్రేమించరు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారనుకోవడం పొరపాటు. మండుటెండలే కాదు, ఈ లోకంలో మల్లెలూ, మంచి గంధాలూ ఉన్నాయి. వాటిని ఆఘ్రాణించేందుకు ప్రయత్నించాలి. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు. కాలో చెయ్యో విరిగిందని ఎవరూ ఆత్మహత్య చేసుకోరు. గుండె పగిలితే మాత్రం ఆత్మహత్యకు పూనుకుంటారు. అంటే శారీరకమైన బాధ కంటే మానసికమైన బాధే మహాప్రమాదం. ఆ ప్రమాదాన్ని పసిగట్టి, ఎదుటివ్యక్తిని కాపాడడంలోనే మానవత్వం ఉంది. కత్తులు పదునుగా ఉంటాయి. నదులు లోతుగా ఉండి భయపెడతాయి. యాసిడ్ మంట పెడుతుంది.
మందులు మత్తు కలిగించి ప్రాణాలు తోడేస్తాయి. రివాల్వర్ కు దయ ఉండదు. ఉరికొయ్యకు జాలి ఉండదు. దయచేసి వాటి జోలికి పోకండి! హత్యలతో కాదు, ఆత్మాహత్యలతోనే దేశసంస్కృతీ, నాగరికతా మంటగలుస్తుంది. దేశపౌరులుగా అది వాంఛనీయం కాదు. జీవించండి! దయచేసి నిండు నూరేళ్ళు జీవించండి! ఈ మాటే సింహప్రసాద్ గారి నవల 'నిండు నూరేళ్ళు' గా మీ ముందుంది. చదవండి! చదివించండి!
- జగన్నాథశర్మ
ఈ ప్రపంచంలో పిడికెడు ఓదార్పు, సానుభూతిగా చారెడు కన్నీరు దొరకడం కష్టం. ఎవరిని ఎవరూ ప్రేమించరు, ఒకరిని ఒకరు ద్వేషిస్తారనుకోవడం పొరపాటు. మండుటెండలే కాదు, ఈ లోకంలో మల్లెలూ, మంచి గంధాలూ ఉన్నాయి. వాటిని ఆఘ్రాణించేందుకు ప్రయత్నించాలి. ఏ సమస్యకూ ఆత్మహత్య పరిష్కారం కాదు. కాలో చెయ్యో విరిగిందని ఎవరూ ఆత్మహత్య చేసుకోరు. గుండె పగిలితే మాత్రం ఆత్మహత్యకు పూనుకుంటారు. అంటే శారీరకమైన బాధ కంటే మానసికమైన బాధే మహాప్రమాదం. ఆ ప్రమాదాన్ని పసిగట్టి, ఎదుటివ్యక్తిని కాపాడడంలోనే మానవత్వం ఉంది. కత్తులు పదునుగా ఉంటాయి. నదులు లోతుగా ఉండి భయపెడతాయి. యాసిడ్ మంట పెడుతుంది. మందులు మత్తు కలిగించి ప్రాణాలు తోడేస్తాయి. రివాల్వర్ కు దయ ఉండదు. ఉరికొయ్యకు జాలి ఉండదు. దయచేసి వాటి జోలికి పోకండి! హత్యలతో కాదు, ఆత్మాహత్యలతోనే దేశసంస్కృతీ, నాగరికతా మంటగలుస్తుంది. దేశపౌరులుగా అది వాంఛనీయం కాదు. జీవించండి! దయచేసి నిండు నూరేళ్ళు జీవించండి! ఈ మాటే సింహప్రసాద్ గారి నవల 'నిండు నూరేళ్ళు' గా మీ ముందుంది. చదవండి! చదివించండి! - జగన్నాథశర్మ© 2017,www.logili.com All Rights Reserved.