నిత్యజీవితంలో మన పరిసరాల నుండే మనం ఎంతో విజ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. కొంచెం పరిశీలించి చూస్తే మనలో ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తాయి. అవి ఎందుకు, ఏమిటి, ఎలా? అనే సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలాను అన్వేషిస్తాయి. ఈ క్రమంలో పరిశోధనలు చేయడం, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అభివృద్ధి చేసుకోవడం, సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉండడం మొదలగు ఎన్నో విలువలను జీర్ణించుకుంటూ ఉంటాము. సైన్సు అంటేనే జిజ్ఞాసను రేకెత్తించేది. ఇందులో చేసి చూస్తేనే న్మమ్మకాన్ని కలిగించే కృత్యాలు కొన్ని అయితే, చూడగానే ఆసక్తిని పుట్టించేవి మరికొన్ని. ఇవి చేసి చూసాక మళ్ళీ చేయాలని, మరెన్నో చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో సులభంగా లభించే పదార్థాలతో కృత్యాలు నిర్వహించుకోవడం వల్ల సమయం, ఖర్చు, శ్రమ ఆదా అవుతాయి. అందరికీ సులభంగా చేరువవుతాయి. మళ్ళీ మళ్ళీ చేయగలిగే వీలును కలిగిస్తాయి. ఇవి పాఠశాలలోనే కాక ఇంటిలో, పరిసరాల్లో కూడా నిర్వహించుకోవచ్చు.
సైన్సు పట్ల ఆసక్తిని, అభిరుచిని పెంపొందించే ఈ కృత్యాలలో మొదట సులభంగా దొరికే వస్తువులతో ప్రారంభిస్తే మిగిలినవి చేసేందుకు సులభంగా ఉంటుంది. శాస్త్రం పట్ల అవగాహన పెంపొందించుకొని, మరికొన్ని కృత్యాలు కనుగొనే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆశిస్తూ....
- టి. శాంతాభాస్కర్
నిత్యజీవితంలో మన పరిసరాల నుండే మనం ఎంతో విజ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. కొంచెం పరిశీలించి చూస్తే మనలో ఎన్నో ఆలోచనలు పుట్టుకొస్తాయి. అవి ఎందుకు, ఏమిటి, ఎలా? అనే సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలాను అన్వేషిస్తాయి. ఈ క్రమంలో పరిశోధనలు చేయడం, ఇతరులతో సంబంధ బాంధవ్యాలు అభివృద్ధి చేసుకోవడం, సమాజంతో సత్సంబంధాలు కలిగి ఉండడం మొదలగు ఎన్నో విలువలను జీర్ణించుకుంటూ ఉంటాము. సైన్సు అంటేనే జిజ్ఞాసను రేకెత్తించేది. ఇందులో చేసి చూస్తేనే న్మమ్మకాన్ని కలిగించే కృత్యాలు కొన్ని అయితే, చూడగానే ఆసక్తిని పుట్టించేవి మరికొన్ని. ఇవి చేసి చూసాక మళ్ళీ చేయాలని, మరెన్నో చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తాయి. మన చుట్టూ ఉన్న పరిసరాల్లో సులభంగా లభించే పదార్థాలతో కృత్యాలు నిర్వహించుకోవడం వల్ల సమయం, ఖర్చు, శ్రమ ఆదా అవుతాయి. అందరికీ సులభంగా చేరువవుతాయి. మళ్ళీ మళ్ళీ చేయగలిగే వీలును కలిగిస్తాయి. ఇవి పాఠశాలలోనే కాక ఇంటిలో, పరిసరాల్లో కూడా నిర్వహించుకోవచ్చు. సైన్సు పట్ల ఆసక్తిని, అభిరుచిని పెంపొందించే ఈ కృత్యాలలో మొదట సులభంగా దొరికే వస్తువులతో ప్రారంభిస్తే మిగిలినవి చేసేందుకు సులభంగా ఉంటుంది. శాస్త్రం పట్ల అవగాహన పెంపొందించుకొని, మరికొన్ని కృత్యాలు కనుగొనే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆశిస్తూ.... - టి. శాంతాభాస్కర్© 2017,www.logili.com All Rights Reserved.