మనిషి మనుగడకు ముఖ్యంగా కావాల్సింది కూడు, గూడు, గుడ్డ. అనాదిగా మానవుడు ఈ మూడింటి కోసమే తాపత్రయపడ్తున్నా, జీవితంలో ఈ మూడింటికీ మూలాధారం రసాయన శాస్త్రమే. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, అమినో ఆసిడ్లు, ఇలా ఎన్నో రసాయన పదార్దాలుంటాయనీ, మనము కట్టుకున్న గూడుకు కావాల్సిన కర్ర, ఇటుక, సిమెంట్, సున్నం మున్నగు వాటిలో సెల్యులోజ్, సిలికాన్, కార్బన్, కాల్షియం మున్నగు రసాయన పదార్థాలుంటాయనిన్నూ, మనం కట్టుకొనే బట్టల్లో సెల్యులోజనే రసాయన పదార్థముంటుందని చాలా మందికి తెలియదు. అందుకే నిత్యజీవితంలో రసాయన శాస్త్రమనే పేరిట బాల్యంలో వున్న విద్యార్థినీ విద్యార్థులకు సైన్సు విషయాలను విశదపరచడమవసరం.
- డా. చాగంటి కృష్ణకుమారి.